మే 10 నుంచి మోదకొండమ్మ ఉత్సవాలు
మూడు రోజులు నిర్వహణ
గ్రామ పెద్దల నిర్ణయం
ఎమ్మెల్యే ఈశ్వరి ఆధ్వర్యంలో సమావేశం
పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలను మే 10 నుంచి 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ చైర్‌పర్సన్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధ్యక్షతన గ్రామ పెద్దలంతా గురువారం నిర్ణయించారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, వర్తక సంఘం, రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆలయ పూజారి ముహూర్తాన్ని ఖరారు చేశారు మే 10,11,12 తేదీల్లో నిర్వహించేందుకు తీర్మానించారు.
ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా నాగభూషణం
ఉత్సవ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఇతర సభ్యులుగా మాజీ మంత్రులు ఎం.బాలరాజు, ఎం.మణికుమారి, పి.బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు జి.దేముడు, లకే రాజారావు,జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ వంజంగి కాంతమ్మ, స్థలదాత లకే ఉమా మహేశ్వర పాత్రుడు, ఎంపీపీ వి.ముత్యాలమ్మ, సర్పంచ్ కిల్లు వెంకటరత్నం, మార్కెట్‌కమిటీ చైర్‌పర్సన్ బొర్రా విజయరాణి, పరిటాల నాగేశ్వరరావు, సీహెచ్ కాశీ విశ్వనాధం, బూరెడ్డి నాగేశ్వరరావు వ్యవహరిస్తారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ఉపాధ్యాయులు కురుసా నాగభూషణం, ప్రధాన కార్యదర్శులుగా బత్తిన కృష్ణ, పూసర్ల గోపి, కోశాధికారులుగా మాగాపు కొండబాబు, ఇమ్మిడిసెట్టి అనీల్, న్యాయ సలహాదారులుగా బండారు వెంకటరమణ, ముఖ్య సలహాదారులుగా పీవీజీ కుమార్, రొబ్బా నాగభూషణరాజు, కె.గంగన్నపడాల్, బొర్రా నాగరాజు, సయ్యపురెడ్డి శ్రీను, ఉపాధ్యక్షులుగా పలాసి కృష్ణారావు, కొట్టగుల్లి సుబ్బారావు, ఎం.అప్పారావు, కె.రమేష్ నాయుడు, కె.ఈశ్వర ప్రసాద్, రొబ్బి శంకరరావు, ఎస్‌వివి రమణమూర్తి, బి.ఈశ్వరరావు, కొట్టగుల్లి రాజారావు, కె.పార్వతమ్మ, చల్లా రామకృష్ణ, కార్యదర్శులుగా డాక్టర్ లకే శివప్రసాద్‌పాత్రుడు, రొబ్బి రాము, కె.ఉమామహేశ్వరరావులు ఎంపికయ్యారు.
వైభవంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే ఈశ్వరి
ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూఉత్సవాల విజయవంతానికి కమిటీకి అన్ని వర్గాల ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. ఘనంగా నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక నిర్వహిస్తున్న పండగ కావడంతో విజయవంతానికి పూర్తిస్థాయిలో పని చేస్తానన్నారు. ఉత్సవాలకు ముందే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానన్నారు. భక్తులకు అన్ని వసతులకు చర్యలు తీసుకుంటామన్నారు. మూడు రోజులు భారీ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ దీపాల అలంకరణలో కమిటీ రాజీపడరాదన్నారు. అన్ని విధాల సహకరించేలా ఐటీడీఏ, రెవెన్యూ, పోలీసు అధికారులతోనూ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే కోరారు.
ముహూర్తం ఖరారు
Published Fri, Feb 20 2015 1:13 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
Advertisement
Advertisement