
సాక్షి, అమరావతి : ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానం అందకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆహ్వానం ఇవ్వకపోయినా తనకు ఏం పర్వాలేదని వ్యాఖ్యానించారు. ఎస్సీ టీడీపీ నేతల శిక్షణా శిబిరం వద్ద ఆయన మాట్లాడుతూ తెలుగు భాషను అందరూ గౌరవించాలలని, తెలుగు ప్రపంచ మహాసభలకు టీడీపీ సంఘీభావం తెలియచేస్తుందన్నారు.
తెలుగు భాష కోసం ఎటువంటి కార్యక్రమాలు జరిగినా టీడీపీ మద్దతిస్తుందని చంద్రబాబు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారంతా ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలనేదే తమ ఆకాంక్ష అని తెలిపారు. దళితుల సంక్షేమం కోసం ముందడుగు లాంటి ప్రత్యే కార్యక్రమాలు చేపతున్నామన్నారు. దళితుల్లోని అన్ని వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయం చేస్తామని పేర్కొన్నారు.
అయితే దీనిపై తెలుగుదేశం నేతలు లోలోన ఒకింత అసహనానికి గురౌతున్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికి హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అని, రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్‌ను ఆహ్వానించిన కేసీఆర్, చంద్రబాబును కావాలనే ఆహ్వానించలేదని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment