
ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీఎం రమేష్
హైదారబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్ నియమితులయ్యారు. ఈ ఎన్నికకు సంబంధించి అనేక గందరగోళ పరిస్థితుల అనంతరం సీఎం రమేష్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా, ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారిగా కేపీ రావు, ఉపాధ్యక్షుడిగా ఎస్వీ మోహన్ రెడ్డిలు ఎన్నికయ్యారు. గత కొన్ని రోజుల క్రితం ఏపీ అసోసియేషన్ అధ్యక్షుడిగా గల్లా జయదేవ్ ఎన్నికైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి, కార్యదర్శిగా జగదీశ్వర్ యాదవ్, కోశాధికారిగా సోమేశ్వర్, ఉపాధ్యక్షుడిగా డా. లక్ష్మణ్ లు ఎన్నికయ్యారు.