రాంనగర్ : వినియోగదారుల ఎల్‌పీజీ నంబర్లను ఆధార్, బ్యాంకు ఖాతాలతో సీడింగ్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికపై పూర్తిచేయాలని కలెక్టర్ ఎన్.సత్యనారాయణ గ్యాస్ డీలర్లను కోరారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో పౌరసరఫరాల శాఖ డిప్యూ టీ తహసీల్దార్లు, ఎల్‌పీజీ డీలర్లతో సమావేశమై ఆధార్,బ్యాంకు ఖాతాల సీడింగ్ ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా ఆధార్‌సీడింగ్, బ్యాంకు అకౌంట్ సీడింగ్ నూరుశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రతి ఎల్‌పీజీ ఔట్‌లెట్ వద్ద వినియోగదారుల అవగాహన కోసం పట్టణ ప్రాంతాల్లో మైకుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దండరో వేయించి అవగాహన కలిగించాలన్నారు. ప్రతి ఎల్‌పీజీ కేంద్రం వద్ద విధిగా బ్యానర్లు ఏర్పాటు చేయాలని, బ్యానర్లు కనిపించనిచో కేసుల నమోదు చేస్తామన్నారు.
నవంబర్ నుంచి సీడింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ఇంకా పూర్తి కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. డీలర్లందరూ వినియోగదారులపట్ల గౌరవ భావంతో ఉండాలన్నారు. ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఎల్‌పీజీ పాయింట్ వద్ద ఏర్పాటు చేసుకుని వినియోగదారులతో టెలిఫోనులో మాట్లాడి ఆధార్ నంబర్, బ్యాంకు అకౌంట్ నంబరు సీడింగ్ కొరకై వ్యక్తిగత శ్రద్ధ చూపాలని కోరారు. అంతేకాక ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వినియోగదారులకు అవగాహన కలిపించాలని సూచించారు. డీలరు వారీగా ఆధార్, బ్యాంకు ఖాతాల సీడింగ్ వివరాలపై రోజు వారి నివేదికలు సమర్పించాలని కోరారు. పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు ప్రతి నెలా కిరోసిన్ 28వ తేదీలోగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సమావేశంలో డీఎస్‌ఓ నాగేశ్వర్‌రావు, ఎ.ఎస్‌ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సీడింగ్ ప్రక్రియను పూర్తిచేయాలి : జేసీ
Published Sun, Jan 25 2015 3:24 AM | Last Updated on Thu, Mar 21 2019 8:22 PM
Advertisement
Advertisement