సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ సందర్భంగా స్వచ్ఛందంగా మూసివేశారు. వైఎస్ఆర్సీపీ, వామపక్ష నేతలు ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఆందోళనలు చేపట్టి ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రజలంతా ఒక్కటిగా నిలబడి బంద్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
Breadcrumb
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
Published Thu, Feb 8 2018 9:00 AM | Last Updated on Sat, Aug 18 2018 4:18 PM
Live Updates
ఏపీలో బంద్ సంపూర్ణం
ఏపీలో బంద్ సంపూర్ణం
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన తీవ్ర అన్యాయంపై రాష్ట్రప్రజానీకం కదంతొక్కింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలంతా ఒక్కటిగా నిలబడి బంద్‌ను విజయవంతం చేశారు. వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ సందర్భంగా మూతపడ్డాయి. వైఎస్ఆర్సీపీ, వామపక్ష నేతలు ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఆందోళనలు చేపట్టి ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు.
పశ్చిమగోదావరిలో కొనసాగుతున్న బంద్
పశ్చిమగోదావరి : కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్ష నాయకులు కొవ్వూరు ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన చేశారు. దీంతో భారీగా పోలీసులు మొహరించారు.
విభజన చట్టంలో ఇచ్చిన హీమీలు నెరవేర్చాలంటూ వైఎస్ఆర్సీపీ, సీపీఎం కార్యకర్తలు జంగారెడ్డిగూడెం బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు. ధర్నాలో పొల్నాటి బాబ్జి, ఆదివిష్ణు, తదితరులు పాల్గొన్నారు.
- తాడేపల్లిగూడెం ఆర్టిసీ డిపో వద్ద వైఎస్ఆర్సీపీ, సీపీఐ, సీపీఎం కార్యకర్తలు ధర్నా చేశారు. ముందస్తు జాగ్రత్తగా అక్కడ పోలీసులు మొహరించారు.
- విభజన చట్టంలోఇచ్చిన హామీలు నెరవేర్చాలని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ అధ్యక్షులు ముదునూర ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో బంద్ కొనసాగించారు.
- చింతలపూడిలో బంద్ నిర్వహిస్తున్న అఖిలపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు.
- ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మధ్యాహ్నపు ఈశ్వరి బలారామ్, వైఎస్ఆర్సీపీ నేత ఎంఆర్డీ బలరాములు అరెస్ట్.
- భీమవరంలో వైఎస్ఆర్సీపీ కన్వినర్ గ్రంధి శ్రీనివాసు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.
- కొవ్వూరు గామన్ వంతెనపై ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్ ఆధ్వర్యంలో యువత టోల్ ప్లాజా వద్ద కుర్చీలు, టైర్లు తగలబెట్టారు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువతను అదుపులోకి తీసుకున్నారు.
అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్
అనంతపురం : జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. వైఎస్ఆర్సీపీ నేతలు ఆర్టీసీ డిపో వద్ద ఆందోళనలు చేపట్టారు. సీపీఐ, సీపీఎం నేతలు బంద్‌లో పాలుపంచుకున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి.
- బంద్‌లో భాగంగా ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ‘చంద్రబాబు అసమర్థత వలనే ఏపీని కేంద్రం పట్టించుకోలేదు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్తానన్న భయం చంద్రబాబును వెంటాడుతోంది. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలను నెరవేర్చకపోయినా బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నారో చంద్రబాబు చెప్పాలి’ అన్నారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ అనంతవెంకట్రామి రెడ్డి, సమన్వయకర్త నదీం అహ్మద్‌లు పాల్గొన్నారు.
- రాయదుర్గంలో వామపక్షాలు, వైఎస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అధ్వర్యంలో బంద్ నిర్వహించారు. దీంతో బస్సులు ఆర్టీసీ డిపోకు పరిమితమయ్యాయి.
- హిందూపురంలో కేంద్ర బడ్జెట్‌కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో సంపూర్ణ బంద్ లో పాల్గొన్నారు. ఏపీపీసీసీ రఘువీరారెడ్డి పాల్గొన్నారు.
- పెనుకొండలో బంద్ ఉద్రిక్తంగా మారింది. టీడీపీ నేతలపై ఆందోళనకారులు మండిపడ్డారు. పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిపై వైఎస్సార్ సీపీ, వామపక్షాలు ధ్వజమెత్తారు. ఒకవైపు మోసం చేస్తూ మరోవైపు నిరసనల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ను అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు ఈడ్చిపడేశారు.
- పెనుకొండలో బంద్ ఉద్రిక్తంగా మారింది. టీడీపీ నేతల నాటకాలపై ఉద్యమకారులు మండిపడ్డారు. పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారధిని వైఎస్ఆర్ సీపీ, వామపక్షాల నేతలు గురువారం ఘెరావ్ చేశారు.
- ఎన్డీయే మిత్రపక్షంలో ఉంటూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించకుండా... నిరసన తెలుపుతున్నట్టు కంటితుడుపు చర్యలకు పాల్పడుతున్నారని అఖిలపక్షనేతలు మండిపడ్డారు. ఎమ్మెల్యేలు అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఉద్యమకారులను చెదరగొట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతల అరెస్ట్
జిల్లాలో బంద్ కొనసాగుతోంది.ఆమదాలవలసలో బంద్‌లో పాల్గొన్న వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ అధ్యక్షులు తమ్మినేని సీతారాంను పోలీసులు అరెస్ట్ చేశారు.
- పాలకొండలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి అరెస్టు
- కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా ఏపీ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ర్యాలీ
- రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావుతో పాటు పలువురు జర్నలిస్టు నేతలను అరెస్టు చేసిన పోలీసులు
- జిల్లా అంతటా బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొంటున్న వ్యాపార వర్గాలు
- పాలకొండ ఎమ్మెల్యే కళావతిని స్వగృహంలో గృహా నిర్బంధం చేసిన పోలీసులు
- మోదీ మాటలు మాని నిధులు విడుదల చేయాలని పాతపట్నంలో టీడీపీ నేతలు ధర్నా చేశారు. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు జిల్లాలో స్వచ్ఛందంగా బంద్
నెల్లూరు : నెల్లూరు నగరంలో సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. బడ్జెట్ పై చంద్రబాబు ద్వంద ప్రమాణాలు అవలంబిస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
- వింజమూరులో వైఎస్ఆర్సీపీ నేతల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. బంగ్లా సెంటర్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన తెలిపారు.
- వెంకటగిరి క్రాస్ రోడ్స్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నేతలు రాస్తారోకో చేశారు. దీంతో భారీగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న బంద్
కృష్ణా : విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ను చంద్రబాబు సర్కార్ నిలదీయలేక పోవడమే ఈ పరిస్థితి కి కారణమని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్త బంద్ లో భాగంగా విజయవాడ లెనిన్ సెంటర్ లో వైఎస్ఆర్సీపీ నేతలు పార్థసారధి, మల్లాది విష్ణుల ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటానికి కలిసి రావాలని డిమాండ్ చేశారు.
- ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, బడ్జెట్లో జరిగిన అన్యాయానికి నిరసనగా వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్, జంపాన కొండలరావు, రాజులపాటి రామచంద్రరావు వైఎస్ఆర్సీపీ నాయకులు బంద్ నిర్వహించారు. స్వచ్ఛందంగా వ్యాపార, విద్యా సంస్ధల మూసివేశారు.
- విభజన హామీల అమలు, కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆందోళన
- చేశారు.
- పామర్రు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త కైలే అనిల్ కుమార్ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
- వైఎస్ఆర్సీపీ సిటీ ప్రెసిడెంట్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెస్ట్ నియోజకవర్గం, సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలలో బంద్ నిర్వహించారు.
- ఇబ్రహీంపట్నం మండలంలో వైసీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు ఏపీకి నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ బంద్ లో పాల్గొన్నారు.
గుంటూరులో బంద్ విజయవంతం
గుంటూరు : కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ నరసరావుపేటలో బస్టాండు ఎదుట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బైఠాయించారు.
- అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సత్తెనపల్లిలో బంద్ విజయవంతంగా నిర్వహించారు.
- పొన్నూరు ర్యాలీలో సమన్వయ కర్త రావి వెంకటరమణ, శ్రీ కృష్ణ దేవరాయలు పాల్గొన్నారు.
- మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
- వేమూరులో మేరుగ నాగార్జున వామపక్షాలతో కలిసి ఆందోళన చేశారు.
- తెనాలిలో వైసీపి నేత అన్నాబత్తుని శివకుమార్, వామపక్ష నేతలు బస్టాండు ఎదుట ధర్నా చేపట్టారు.
- మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో రేపల్లె వీధుల్లో నిరసన ర్యాలీ చేశారు.
ప్రకాశంలో ప్రశాంతంగా బంద్
ప్రకాశం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, బడ్జెట్లో జరిగిన అన్యాయానికి నిరసనగా వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ యడం బాలాజీ ఆద్వర్యంలో చీరాలలో బంద్ నిర్వహించారు.
- జిల్లాలో బంద్ కొనసాగుతుంది. 11 డిపోల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
- మార్కాపురంలో బస్ డిపో ఎదుట వామపక్ష నాయకులు ఆందోళన చేశారు. వైఎస్ఆర్సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
- ఒంగోలులో అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇందులో ఒంగోలు వైఎస్ఆర్సీపీ సిటీ అధ్యక్షులు సింగరాజు వెంకటరావు, సీపీఎం కొండారెడ్డి, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
- ఒంగోలు లో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ నియోజక వర్గ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బైక్ రాలీ నిర్వహించారు. అఖిల పక్షాలతో కలసి కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొన్నారు.
వైఎస్ఆర్ జిల్లాలో బంద్ ప్రశాంతం
వైఎస్సార్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. స్వచ్ఛందంగా విద్యా, వ్యాపార సంస్థల మూసివేశారు. మరోవైపు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. బంద్‌లో వామపక్షాలు, వైఎస్ఆర్ సీపీ నేతలు పాల్గొన్నారు.
- కడపలో మేయర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో ర్యాలీ
- పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో బంద్
- రాజంపేటలో బంద్‌లో పాల్గొన్న పార్లమెంటు అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి
- ప్రొద్దుటూరులో బంద్ నిర్వహించిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి
- పోరుమామిళ్లలో బంద్‌లో పాల్గొన్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి
- బంద్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు
జిల్లాలో స్తంభించిన జనజీవనం
విపక్షాల బంద్ ప్రభావంతో విజయనగరం జిల్లా లో జనజీవనం స్తంభించింది. బస్సులన్నీ డిపోలకే పరిమిత మయ్యాయి. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు సైతం బంద్‌కు మద్దతుగా నిలిచారు.
- రాష్ట్ర బంద్ సందర్భంగా సాలూరులో వామపక్షాలు తో కలిసి.. ఆంధ్రా ఒడిశా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర.
- కురుపాంలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఆధ్వర్యం లో బంద్.. ర్యాలీలు..ప్రత్యేక హోదా కావాలంటూ రోడ్లపై బైటాయింపు.
- బంద్‌లో పాల్గొన వామపక్షాలు, విపక్షాలు, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు.. అరకు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు పరీక్షీత్ రాజు.
- పార్వతీపురంలో ఉదయం 5గంటల నుండి ఆర్టీసీ డిపోల వద్ద వామపక్ష నాయకులు ఆందోళనకు దిగారు.డిపోలో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియెజకవర్గ సమన్వయకర్తలు జోగారావు, ప్రసన్నకుమార్, సీపీఎం నేత రెడ్డి శ్రీరామమూర్తి సీపీఐ నేత కుమార్‌తో పాటు ఎస్ఎఫ్ఐ, సీఐటీయూ నేతలు పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలో కొనసాగుతున్న బంద్
వామపక్షాలు, వైఎస్ఆర్ సీపీ పిలుపునిచ్చిన బంద్ జిల్లాలో పూర్తిస్థాయిలో జరుగుతుంది. దీంతో జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరోవైపు బస్సుల కోసం ద్వారకా కాంప్లెక్స్ ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. గాజువాక, స్టీల్‌ప్లాంట్‌లోనూ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.
- విశాఖ ఏజెన్సీలో నిలిచిన ప్రైవేట్,ఆర్టీసీ బస్సులు,జీపులు. అలాగే సంతల్లో దుకాణాలు తెరుచుకోలేదు. ఈ బంద్ అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని, తక్షణమే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలని వైఎస్ఆర్ సీపీ నాయకుడు కుంబా రవిబాబు అన్నారు.
- విశాఖ ఏజెన్సీ పెదబయలులో వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి చెట్టి వినయ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బంద్
- విశాఖ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్ సీపీసమన్వయకర్త వంశీకృష్ణ ఆధ్వర్యంలోమద్దిలపాలెం కూడలిలో బంద్... మానవహారం
- విశాఖ... బంద్‌కు మద్దతుగా విశాఖ దక్షిణ వైస్సార్సీపీ సమన్వయకర్త కోలా గురువులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
చిత్తూరులో స్వచ్ఛందంగా బంద్
అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా బస్సు సర్వీసులు నిలిపివేయగా, విద్యాసంస్థలు స్వచ్చందంగా సెలవులు ప్రకటించాయి. చిత్తూరులో దుకాణాలు మూసివేసి బంద్‌కు వ్యాపారస్తులు మద్దతు పలికారు. చిత్తూరులో పార్లమెంట్ కన్వీనర్ జంగాలపల్లి శ్రీనివాసులు, మహిళా నేత గాయత్రి, సిపిఐ నాయకులు నాగరాజ,కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది.
- అలాగే తిరుపతిలో బంద్ కొనసాగుతోంది.ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీపీఎం, సీపీఐ నేతలు నిరసనకు దిగడంతో ఒక్క బస్సు కూడా బయటకు కదలలేదు.
- పీలేరులో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. బస్సుల డిపోకే పరిమితం కాగా, దుకాణాలు, విద్యాసంస్థలు మూసివేశారు.
- బంద్ ప్రభావంతో చిత్తూరు జిల్లా కాణిపాకంలో భక్తులకు ఇబ్బందులు పడుతున్నారు. కాగా బంద్ అని ముందే హెచ్చరించినా ఎందుకు వచ్చారని అంటున్న ఆందోళన కారులు ప్రశ్నిస్తున్నారు.
- చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్.
- బంద్ ప్రభావంతో పలమనేరులో బస్సుల నిలిపివేత,స్వచ్చందంగా బంద్ కి సహకరిస్తున్న వ్యాపారస్తులు,విద్యాసంస్థలు
- వామపక్ష నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
- చెవిలో పూలు, ఒంటిపై నామాలతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
- కేంద్రం .. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పంగనామాలు పెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తూర్పుగోదావరిలో కొనసాగుతున్న బంద్
తూర్పుగోదావరి : వైఎస్ఆర్సీపీ జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ గోకవరం బస్ డిపో వద్ద ఆందోళనకు దిగటంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వరసాల ప్రసాద్, ముత్యం నాని, కర్రి సూరారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు నారాయణస్వామి ఆధ్వర్యంలో రాజోలు డిపో వద్ద బస్సులను నిలిపివేశారు. ఇందులో సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
- పత్తిపాడు నియోజకవర్గం అంతటా కేంద్ర మొండి వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ , వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. కార్యక్రమంలో పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కో ఆర్డినేటర్ పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
- వైఎస్ఆర్సీపీ నేతలు పీ గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి, అంబాజీపేటలో వామపక్షాలతో కలసి బంద్ నిర్వహించారు.
- వామపక్షాలు ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో కేంద్రబడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు.
కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న బంద్
కర్నూలు : వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రానికి జరిగిన అన్యాయం జరిగిందంటూ కర్నూలు బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీవై రామయ్య, హఫీజ్ ఖాన్, సురేందర్ రెడ్డి, రాజావిష్ణువర్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- ఆత్మకూరులో వామ పక్షాలు, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల ఆధ్వర్యంలో గౌడ్ సెంటర్లో ధర్నా చేశారు.
- ఎమ్మిగనూరులో బంద్ లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ అరెస్ట్ చేశారు.
- బనగానపల్లె పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ, వామ పక్షాల అద్వర్యం లో బంద్ నిర్వహించారు. అదేవిధంగా పెట్రోల్ బంక్ కూడలి లో ధర్నా చేపట్టారు.
- నందికొట్కూరులో వామ పక్షాలు, వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించి, పటేల్ కూడలిలో ధర్నా చేశారు. ఇందులో ఎమ్మెల్యే ఐజయ్య పాల్గొన్నారు.
Related News By Category
Related News By Tags
-
బంద్ ప్రశాంతం
సాక్షి,విశాఖసిటీ: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలన్నీ నెరవేర్చాలనే డిమాండ్‌తో అఖిలపక్షాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్...
-
ఏపీ బంద్ సంపూర్ణం
సాక్షి, నెట్వర్క్/అమరావతి: టీడీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించినా.. నోటీసులిచ్చి బెదిరించినా.. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసినా కూడా ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా సోమవారం చేపట్టిన రాష్ట్ర బంద్ సంపూ...
-
రాష్ట్ర భవిష్యత్ కోసమే బంద్
విజయనగరం మున్సిపాలిటీ : రాష్ట్ర భవిష్యత్ కోసం, ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా సాధనకు సోమవారం చేపడుతున్న రాష్ట్ర బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్...
-
'కేసుల భయంతో చంద్రబాబు సాగిలపడ్డారు'
సాక్షి, ఒంగోలు: రెండెకరాల చంద్రబాబు.. రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించారని వైఎస్సార్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఆయన గురువారం మీడిమాతో మాట్లాడుతూ.. దేశంతో అత్యంత ధనిక సీఎం చంద్రబాబే...
-
పశ్చిమలో నిరసనల హోరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్టణంలో గురువారం తలపెట్టిన కొవ్వొత్తుల ...
Comments
Please login to add a commentAdd a comment