కూచ్‌బెహర్ షాట్ రెడీ!
► రేపటి నుంచి శర్మ కళాశాల గ్రౌండ్‌లో ప్రారంభం కానున్న క్రికెట్ టోర్నీ
► పోటీ పడనున్న ఆంధ్రా,జమ్మూకాశ్మీర్ జట్లు
►వివరాలను ప్రకటించిన పీడీసీఏ
ఒంగోలు :స్థానిక సీఎస్‌ఆర్ శర్మ కళాశాల క్రీడామైదానంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న అండర్-19 కూచ్‌బెహర్ క్రికెట్ టోర్నీలో పోటీపడనునన్న ఆంధ్రా, జమ్మూకాశ్మీర్ జట్లు ఒంగోలుకు చేరుకున్నారుు.శనివారం గ్రౌండులో ముమ్మర సాధన చేశారుు. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ క్రీడా ప్రాంగణాన్ని గతంలో కంటే అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒక వైపు వాతావరణం తేమగా ఉండడం, మరో వైపు తుఫాను హెచ్చరికల నేఫథ్యంలో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారుతుందని క్రీడాపండితులు అంచనా వేస్తున్నారు.
జమ్మూకాశ్మీర్ జట్టు ఇదే..
కమ్రాన్ ఇక్భాల్(కెప్టెన్), దావీద్ రహీల్, తాసీన్ దార్, మామిన్ మన్సూర్, ఫైజాన్ సాదిక్, విక్రాంత్ శర్మ, యుద్‌వీర్, రవూఫ్‌భట్, షారుఖ్ అహ్మద్, అమీర్ ద్రాబు, ఆదిత్య చిబ్, కన్వసైని, పావిత్ సింగ్ ఇషార్, అఫ్నాన్ తారిక్, ముజీబ్ ఉల్ హక్, హిమాంగు చందన్, మిలాల్ అహ్మద్(మేనేజర్), కోచ్ ఎన్‌పీ సింగ్, సహాయ కోచ్ ఆషిక్ అజీజ్.
ఆంధ్రా జట్టు:
సీఆర్ జ్ఞానేశ్వర్(కెప్టెన్), ధృవకుమార్‌రెడ్డి, పి.గిరినాథ్‌రెడ్డి, కె.ఎన్. పృధ్వీరాజ్, క్రాంతికిరణ్, పృధ్వీరాజ్ యర్రా, రెడ్డి గిరీష్ కమల, యుఎంఎస్ గిరినాథ్, యుదీష్ సూరపనేని, మహీప్‌కుమార్, షేక్ మొహమ్మద్ రఫీ, సందీప్, డి.జి.జె. చైతన్య, ఎం.హరిశంకరరెడ్డి, ఎస్.ఆశిష్, వై.ప్రమోద్, షేక్ ముదాస్సిర సభ్యులుగా ఉన్నారు. హెడ్ కోచ్‌గా ఎన్.నిర్మల్‌కుమార్, సహాయ కోచ్‌గా శివకుమార్‌రాజు, కోచ్‌గా వి.వి. అప్పారావు, మేనేజర్‌గా జీఎస్ మల్లికార్జునరావు వ్యవహరిస్తున్నారు.