అదంతా కార్పొరేట్ మీడియా సృష్టే: నారాయణ | Corporate Media create modi image, says narayana | Sakshi
Sakshi News home page

అదంతా కార్పొరేట్ మీడియా సృష్టే: నారాయణ

Published Tue, Jun 24 2014 3:05 PM | Last Updated on Sat, Sep 22 2018 8:07 PM

అదంతా కార్పొరేట్ మీడియా సృష్టే: నారాయణ - Sakshi

అదంతా కార్పొరేట్ మీడియా సృష్టే: నారాయణ

మదనపల్లె: ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీని దేశమంతా సమర్థుడని కితాబునిస్తున్నారని, అయితే ఇదంతా కార్పొరేట్ మీడియా సృష్టించిన ప్రచారమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె. నారాయణ విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలే మోడీకి ఎంతో దోహదపడ్డాయని చెప్పారు.  మదనపల్లెకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు  కూర్చొని చర్చించుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉండగా రాజకీయాలు చేస్తూ ఇరు ప్రాంతాల్లో ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. వీరిద్దరూ ఉద్దేశపూర్వకంగానే సమస్యలను జఠిలం చేస్తూ ఉనికి కాపాడుకునేందుకే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. దివంగత సీపీఐ  నేత చండ్రరాజేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను వచ్చేనెల 11వ తేదీ హైదరాబాదులో జరపనున్నట్టు నారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement