పంచాయతీ సొమ్ము ఫలహారం | corruptions in panchayati money | Sakshi
Sakshi News home page

పంచాయతీ సొమ్ము ఫలహారం

Published Tue, Jan 14 2014 1:36 AM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM

corruptions in panchayati money

 కోదాడటౌన్, న్యూస్‌లైన్: నల్లబండగూడెం గ్రామ సొమ్మును తలా ఇంత తిన్నారు. జరిగిన అన్యాయాన్ని గ్రామస్తులు స్థానిక అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఫిర్యాదు చేశారు. కానీ వారి రోదన అరణ్యరోదనగా మారింది.  పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా చేసుకొని అధికారుల, ప్రజాప్రతినిధుల అవినీతి బండారాన్ని సాక్ష్యాధారాలతో వెలికి తీసి లోకాయుక్తాకు ఫిర్యాదు చేయడంతో ఈ అవినీతి డొంక కదిలింది.

 దీనిలో అందరూ పాత్రధారులగా మారిన వైనం, చట్టాలున్నా, నిబంధనలున్నా కనీస భయం లేని వైనం ఈ  కుంభకోణంలో కళ్లకు కడుతున్నది. ప్రతి సంవత్సరం తనిఖీ చేయాల్సిన అధికారులు చూసి చూడ నట్లు వ్యవహరించన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.

 ఓవర్‌డ్రాఫ్ట్ (ఓడీ) సౌకర్యం కూడా కల్పించారు..
     నల్లబండగూడెం గ్రామ పంచాయతీకి  కోదాడ సబ్ ట్రెజరీ అధికారులు ఓవర్‌డ్రాఫ్ట్ (ఖాతాలో నిల్వ డబ్బులు లేకపోయినా అప్పు రూపంలో నగదు తీసుకోవచ్చు) సౌకర్యం కల్పించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
     పంచాయతీ ఖాతాలో నిధులు లేకున్నా 2005 అక్టోబర్ 1వ తేదీన ట్రెజరీ ఉద్యోగులు ప్రజాప్రతినిధికి 25,656 రూపాయలను ఓడిగా ఇచ్చారు.
      2005 అక్టోబర్ 28న కూడా మరోసారి 40,486 రూపాయలను ఓడి ఇచ్చారు. ఇది 2006 వరకు కొనసాగింది.
     అయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. ఆ ప్రజాప్రతినిధిని ఆదర్శంగా తీసుకున్న అధికారి కూడా ఓడి తీసుకొని డబ్బులను డ్రా చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 2012 మార్చి 6న కూడా ట్రెజరీ కార్యాలయం నుంచి 19,323  ఓడి తీసుకున్నాడు.
     ఈ మొత్తం వ్యవహారంలో అనేక ఉల్లంఘనలున్నందున సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు లోకాయుక్తాను ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement