జగదేవ్‌పూర్, న్యూస్‌లైన్ : అప్పుల బాధతో మండల పరిధిలోని రాయవరం మదిరా పీటీ వెంకటాపూర్‌కు చెం దిన రైతు కుమ్మరి వెంకటయ్య (36) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వెం కటయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగి స్తున్నాడు. తనకున్న రెండు ఎకరాలతో పాటు మరో నా లుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగు చేస్తున్నాడు. పంట సాగుకు, ఈ యేడాది కుమార్తె పెళ్లికి దాదాపు 2 లక్షల వరకు అప్పు చేశాడు. పంట పం డితే అప్పులు తీరుతాయనుకున్నాడు.
అయితే ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. మూడేళ్లుగా పత్తి పంటలో తీవ్ర నష్టం వాటిల్లడంతో అప్పులు పెరిగి పోయాయి. అయితే అప్పులు తీర్చే మార్గం లేక బుధవారం రాత్రి తన పొలంలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకు లు గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్సల అనంతరం వైద్యుల సూచనల మేర కు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య శ్యామల, కుమార్తెలు మహేశ్వరి, మౌనిక, కు మారుడు సాయికుమార్‌లు ఉన్నారు. వీఆర్‌ఓ హరీష్ పంచనామా నిర్వహించారు.
వారంలో ముగ్గురు బలవన్మరణం
మండల పరిధిలో గడచిన వారం రోజుల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే అందరూ పరిస్థితీ ఒక్కటే. పంట పెట్టుబడులు, కుటుంబ అవసరాలకు అప్పులు చేశారు. అయితే పంటలు పండక పోవడ ంతో అప్పులు తీరే ్చ మార్గం లేక తనవును చాలించారు.
పలువురు పరామర్శ
మృతి చెందిన రైతు వెంకటయ్య కుటుంబ సభ్యులను టీడీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి, కొండ పోచమ్మ మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎంబరి రాంచంద్రంలు పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రతాప్ రెడ్డి రూ.2 వేలు ఆర్థిక సాయం అందజేశాడు.
అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య
Published Fri, Nov 22 2013 6:59 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement
Advertisement