దేశం దురాక్రమణ | Country of aggression | Sakshi
Sakshi News home page

దేశం దురాక్రమణ

Published Wed, Dec 3 2014 2:42 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

Country of aggression

 రేపల్లె/నిజాంపట్నం: అధికారం వచ్చింది..అందినంత దోచుకుందాం అనే రీతిలో రేపల్లె నియోజకవర్గ టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం చేపట్టిన ఐదు నెలల్లో అధికారులను లొంగదీసుకుని 15.13 ఎకరాల అటవీ భూమికి పట్టాలు పొందారు. మరో పది ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి చెరువులుగా తవ్వి ఆక్వా సాగుకు సిద్ధం చేశారు.
 
  నిజాంపట్నం మండల ఆముదాలపల్లి పంచాయతీ చింతరేవులోని అటవీ భూ మి 583 సర్వే నంబరులో 15.13 ఎకరాలను అధికార పార్టీకి చెందిన ఆరుగురికి తహశీల్దారు పట్టాలు జారీ చేశారు.
 
 మండల టీడీపీ అధ్యక్షుడు ఓగిబోయిన వెంకట్‌యాదవ్ తల్లి సీతారావమ్మకు 2.5 ఎకరాలు, ఆముదాలపల్లి టీడీపీ నేత పందరబోయిన కృష్ణమూర్తికి 2.5 ఎకరాలు, ఆయన భార్య తిరుపతి కుమారికి 2.5 ఎకరాలు, కుమార్తె నర్రా సుజాతకు 2.5 ఎకరాలు, రేపల్లె మండలం ఉప్పూడి గ్రామానికి చెందిన బొర్రా కుమారికి 2.5ఎకరాలు, నగరం గ్రామానికి చెందిన పిన్నిబోయిన వెంకటేశ్వరరావుకు 2.5ఎకరాలుకేటాయిస్తూ నవంబర్ 10నపట్టాలను అప్పటి తహశీల్దారు రవికుమార్ జారీ చేశారు.
 
 అటవీశాఖ భూములను టీడీపీ నేతలకు ధారాదత్తం చేసిన విషయంపై ప్రస్తుత తహశీల్దారు మోహనకృష్ణను వివరణ కోరేందుకు ‘సాక్షి’పలుమార్లు ప్రయత్నం చేయగా, తాను సమావేశంలో ఉన్నానంటూ తెలిపారు.
 పట్టాలు రద్దు చేయాలని
 సిఫార్సు చేశారు..
 చింతరేవులో ఉన్న అటవీభూమి 583 సర్వే నంబరులోని 15.13 ఎకరాలను ఆరుగురు వ్యక్తులకు తహశీల్దారు రవికుమార్ పట్టాలు జారీ చేయటంపై జిల్లా ఫారెస్ట్ అధికారికి నివేదిక సమర్పించడం జరిగింది. జిల్లా ఫారెస్ట్ అధికారి దీనిపై స్పందించి ఆ పట్టాలు  రద్దు చేయాలని కలెక్టర్, ఆర్డీవోలకు సిఫార్సు చేశారు.
 - రమణారెడ్డి,
 అటవీ శాఖ రేపల్లె రేంజ్ అధికారి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement