
మద్యం పాలసీపై మండిపడ్డ సీపీఎం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ సీపీఎం నాయకులు విజయవాడలోని బీసెంట్ రోడ్డులో మంగళవారం నిరసనకు దిగారు. ప్రభుత్వ విధానాలు నశించాలని, ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బులు దండుకునే రాష్ట్ర ప్రభుత్వ మద్యం పాలసీని వ్యతిరేకించాలని కోరుతూ బ్యానర్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా నాయకులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేశారు.