మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: జిల్లాలో నేరాల అదుపునకు, పోలీసుల పనితీరును నియంత్రించేందుకు అధునాతనమైన ‘బీట్‌పోలీస్ ట్రాకింగ్ సిస్టమ్’ను అమలు చేయనున్నట్లు జిల్లా ఎ స్పీ నాగేంద్ర కుమార్ శుక్రవారం వెల్లడించారు. స్థానిక ఎస్పీ కా ర్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ట్రా కింగ్ విధానాన్ని గూగుల్‌కు అనుసంధానం చేయనున్నట్లు తెలి పారు. రాత్రి వేళల్లో గస్తీ తిరిగే పోలీస్ సిబ్బంది పనితీరును సమీక్షించేందుకు వీలవుతుందన్నారు. బీట్ నిర్వహించే ప్రతీ పోలీస్‌వద్ద ఓ మొ బైల్ ఫోన్ ఉంటుందని దానిని పోలీస్ శాఖతోపాటు , గూగుల్‌కు అనుసంధానం చేస్తారన్నారు.
ఇలా ప్రమాదకర సంఘటనలు, హత్యలు, మహిళలపై లైంగిక వే దింపులు, ఈవ్ టీజంగ్‌లకు పాల్పపడే వాటిలో బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా తమ టీం పని చేస్తుందన్నారు. ప్రతి రోజు విధు ల్లో ఉన్న పోలీసులు ఈ మోబైల్ ద్వారా రౌడీషీటర్లు, పాతనేరస్తులతోపాటు నింది తుల ఫోటోలను తీస్తారన్నారు. ఈ ఫోటోలను తక్షణమే గూగుల్‌లో నిక్షిప్తం కావడం వల్ల నేరాలను అదుపు చేయవచ్చన్నారు.
రక్షిత ఆప్స్ నెట్‌వర్కింగ్ కూడా...
బాలికలకు, మహిళలకు రక్షణ కల్పించేం దుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రక్షిత ఆప్స్‌నెట్‌వర్కింగ్ సిస్టమ్‌ను ప్రారభించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఇం దులో భాగంగా త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, బాలికలపై జ రుగుతున్న అఘాయిత్యాలను నిరోధిం చేందుకు ఈ నెట్‌వర్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బాధితులు తమకు ఆ పద ఉన్నట్లు అనుమానం వచ్చిన వెంటనే 119 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాలని సూచించారు. తమ తమ సెల్‌ఫోన్‌లకు రక్షిత ఆప్స్‌ను వెబ్‌సైట్ ద్వారాగాని స్థానిక పోలీస్‌స్టేషన్ల ద్వారా గాని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. దీని వల్ల భవిష్యత్తులో నేరాలను అదుపు చేసేందుకు పటిష్టమైన చర్యలతోపాటు బాధితులకు పోలీ స్ శాఖ అండదండగా ఉంటుందన్నారు.
బాలికలపై లైంగిక వేధింపులు గాని ప్రేమ పేరిట బెదిరింపులు, ైమైనర్లను ఎత్తుకెళ్ల డం వంటి వారిపై నిర్భయ చట్టం కన్న కఠినంగా ఉన్న పాక్సొ చట్టం కింద అరె స్టు చేస్తామన్నారు. ఈ కేసులో నిందితులుగా తేలితే కచ్చితంగా పదేళ్లకు పైగా కఠినకారాగార శిక్ష తప్పదన్నారు. దీనిపై పాఠశాలలో, కళాశాలలో, హాస్టళ్లలో విస్తృ త ప్రచారం నిర్వహించేందకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ప్రదీప్‌రెడ్డి, డీఎస్పీ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
డీజీపీచే పలు ప్రారంభోత్సవాలు
రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. ప్ర సాదరావు శనివారం జిల్లాలో పర్యటించనున్నారని ఎస్పీ తెలిపారు. ఈ మేరకు జి ల్లాలోని పలు ప్రాంతాల్లో కొత్తగా నిర్మించి న పీఎస్‌లతోపాటు మరొకొన్ని కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కొత్తూరు ప్రాంతంలో నిర్మించి న షాద్‌నగర్ రూరల్ పీఎస్, పెద్దమందడిలో కొత్తగా నిర్మించిన పోలీస్‌సేష్టన్‌తోపాటు జిల్లా కేంద్రంలోని సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రూ. కోటి నిధులతో నిర్మిస్తున్న డీపీఓ కా ర్యాలయం, రూ. 70 లక్షలతో నిర్మిస్తున్న కంట్రోల్ రూమ్, రూ. 75 లక్షలతో ట్రా ఫిక్ పీఎస్ భవనాలను శంకుస్థాపన చేస్తారన్నారు. దీంతోపాటు పోలీస్ క్యాంటీన్ స్టోర్‌ను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
నేరాల అదుపునకు ట్రాకింగ్ సిస్టమ్
Published Sat, Jan 11 2014 3:38 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement