Nagendra kumar
-
వంతెనపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని గామన్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక అచ్చాయమ్మకాలనీకి చెందిన చినరావూరి సుబ్బారావు కుమారుడు నాగేంద్రకుమార్(28) శుక్రవారం గామన్ బ్రిడ్జిపై నుంచి దూకి, అరికిరేవులపాడు రోడ్డుపై పడ్డాడు. ముఖానికి తీవ్రగాయాలు కావటంతో అక్కడికక్కడే చనిపోయాడు. అయ్యప్ప దీక్షలో ఉన్న నాగేంద్రకుమార్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హ్యాట్సాఫ్..! నాగేంద్రకుమార్!!
ఆడుతూ పాడుతూ గడపాల్సిన ఐదేళ్ల వయసులో విధి చిన్న చూపు చూడటంతో అతడు రెండు చేతులూ కోల్పోయాడు. తోటి వారంతా ఉత్సాహంగా గంతులు వేస్తుంటే కలత చెందలేదు. తన తలరాత ఇంతేనని నాలుగు గోడల మధ్య కూర్చొని చింతించలేదు. జీవితానికి చదువే ఆయుధమనుకున్నాడు. ఇక్కడా అతనికి చేదు అనుభవమే. ఉన్నత చదువుకు ఆర్థిక స్థోమత సహకరించడం లేదు. ఇప్పుడు సాయం కోసం చేయి చాస్తున్నాడు. మంచిగా చదివి కుటుంబానికి అండగా ఉండాలనుకుంటున్నాడు. * ఐదేళ్ల వయసులో విద్యుదాఘాతం * రెండు చేతులూ మోచేయి వరకు తొలగింపు * అయినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం * ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం * పేదరికంతో విద్యకు ఆటంకం * ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు ఒంగోలు టౌన్ : మేదరమెట్ల మండలం సోమవరప్పాడులో దాట్ల చినకోటయ్య, సుబ్బరత్నం దంపతులకు ఇద్దరు సంతానం. వారు కూలీ నాలీ చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడు నాగేంద్రకుమార్ ఐదేళ్ల వయసులో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఫలితంగా రెండు చేతులూ మోచేతుల వరకు వైద్యులు తీసేశారు. ఇంటికి పెద్ద కుమారుడు వృద్ధాప్యంలో తమను ఆదుకుంటాడని భావించిన ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. రెండు చేతులు లేకున్నా ఆ విద్యార్ధి ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు. ఇతర విద్యార్థుల మాదిరిగానే అన్ని విషయాల్లోనూ పోటీ పడుతూ వచ్చాడు. ఎలాగోలా గ్రిప్ సాధించుకొని పెన్నూ పుస్తకం పట్టాడు. వేగంగా రాయడం.. వేగంగా పుస్తకాలు తీసి చదవడం ప్రారంభించాడు. ఇంతలో పదో తరగతికి చేరాడు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై అందరిచేత ‘శభాష్’ అనిపించుకున్నాడు. ఇంటర్లో కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రస్తుతం మేదరమెట్లలోని శారదా డిగ్రీ కాలేజీలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సైకిల్‌ను అవలీలగా తొక్కేయగలడు. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కూడా పెంచుకునే పనిలో నిమగ్నమయ్యాడు. పింఛన్‌తో చదువుకుంటూ.. తల్లిదండ్రులకు నాగేంద్రకుమార్‌ను చదివించడం కష్టంగా మారింది. రెండు చేతులు లేకపోవడంతో ఏమి చదువుతాడులే అని మొదట్లో వారు కూడా కలత చెందారు. చివరకు తమ కుమారుడు చదువులో రాణిస్తుంటే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారు సంపాదించే కూలీ డబ్బులు కుటుంబ అవసరాలకు అంతంత మాత్రంగా ఉండటంతో నాగేంద్రకుమార్‌కు పింఛన్ అండగా నిలిచింది. ప్రతినెలా వచ్చే వికలాంగ పింఛన్‌తో ఒకరిపై ఆధారపడకుండా చదువుకుంటూ ముందంజలో ఉన్నాడు. ఒకవైపు వయసు పెరుగుతుండటం, ఇంకోవైపు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పడుతుండటంతో స్వయం ఉపాధి సాధించాలని నాగేంద్రప్రసాద్ మనసులో పడింది. చదువుకుంటూనే ఉపాధి ద్వారా కుటుంబానికి ఆసరాగా ఉండాలని భావిస్తున్నాడు. నాగేంద్రకుమార్‌ను ఆదుకోవాలనుకునేవారు 90522 06762 నంబర్‌ను సంప్రదించవచ్చు. -
కొత్త కాన్సెప్ట్‌తో కామెడీ
‘గుండెల్లో గోదారి’తో ప్రశంసలందుకున్న దర్శకుడు కుమార్ నాగేంద్ర రెండో ప్రయత్నం ‘జోరు’. సందీప్‌కిషన్, ‘ఊహలు గుసగుసలాడే’ ఫేమ్ రాశీ ఖన్నా, సుష్మా, ప్రియా బెనర్జీ ముఖ్యతారలు. ఈ నెల 7న రిలీజ్ కానున్న చిత్రం గురించి, దర్శకుడు ‘సాక్షి’తో మాట్లాడుతూ, ‘‘నా తొలి చిత్రానికి భిన్నంగా పూర్తి వినోదాత్మకంగా సాగే సినిమా ఇది. నేటి యువతరం కోరుకొనే రీతిలో ప్రతి సన్నివేశం ‘జోరు’గా సాగుతుంది. ఒకే పాత్రను ముగ్గురు పోషించడమనే వినూత్న కాన్సెప్ట్ అనుసరించాం. పాత్రల మధ్య గందరగోళంతో ప్రేక్షకు లకు బోలెడంత వినోదం వస్తుంది’’ అని వివరించారు. కథా పరంగా ముగ్గురు నాయికలకూ ప్రాధాన్యమున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు అశోక్, నాగార్జున మాట్లాడుతూ,‘‘సినిమా చకచకా సాగుతుంది. బ్రహ్మానందం, సప్తగిరి, పృథ్వీరాజ్ కామెడీ మరో హైలైట్’’ అని పేర్కొన్నారు. -
సందీప్ ‘జోరు’ చూడొచ్చు
‘‘ఈ సినిమా నేను చేయడానికి ఏకైక కారణం దర్శకుడు కుమార్ నాగేంద్ర. ఆయనపై గుడ్డి నమ్మకంతోనే ఈ సినిమా ఒప్పుకున్నా. ఎందుకంటే ‘గుండెల్లో గోదారి’ సినిమాలో నాతో అద్భుతమైన పాత్ర చేయించారాయన. భవిష్యత్తులో కూడా మేం సినిమాలు చేస్తాం’’ అని సందీప్ కిషన్ చెప్పారు. సందీప్ కిషన్, రాశిఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మా హీరోహీరోయిన్లుగా కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో అశోక్, నాగార్జున నిర్మించిన ‘జోరు’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత ఎన్వీప్రసాద్ పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని నటుడు బ్రహ్మానందంకు అందించారు. ప్రచార చిత్రాలను బోయపాటి శ్రీను ఆవిష్కరించారు. సినిమా చాలా బాగా వచ్చిందని, సందీప్ కిషన్, బ్రహ్మానందంల సహకారం మరిచిపోలేనిదని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. ఇందులో నాయిక రాశి ఖన్నాతో పాట పాడిం చానని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తెలిపారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ జోరు చూడొచ్చని బ్రహ్మానందం అన్నారు. ఈ వేడుకలో బి. గోపాల్ నరేష్, సప్తగిరి, పరుచూరి బ్రదర్స్, వీరశంకర్, మేర్లపాక గాంధీ, పాల్గొన్నారు. -
బందో మస్తు..!
మహబూబ్‌నగర్ క్రైం,న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతాలుగా గుర్తించిన ఏడు ప్రాం తాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ గురువారం బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపధ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నట్లు జి ల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ వెళ్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బందు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్లలో, ఆర్టీసి బస్డాండ్ల వద్ద, సినిమా హాళ్లు, పెట్రోల్ పంప్‌లు, వ్యాపార సముదాయాల వద్ద పోలీసుల పహరా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు జాతీయ రహదారిపై ఉన్న చెక్ పోస్టుల వద్ద పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ దళాలు,స్పెషల్ పోలీసులతో పాటు సివిల్. రిజర్వ్ పోలీసులు విధులు నిర్వహిస్తారని చెప్పారు. పెట్రోలింగ్ పార్టీలు బందును పర్యవేక్షిస్తారని తెలిపారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని డివిజన్ పరిధుల్లోని డీఎస్పీలు పోలీసులకు సూచనలు అందిస్తారని వివరించారు. పజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు రాజకీయ పార్టీలు పోలీసులకు సహకారం అందించాలని కోరారు.స్వచ్ఛందంగా బందు నిర్వహిస్తే పోలీసులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.బలవంతంగా వ్యాపార సంస్థలను మూసి వేయరాదని అలా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి రాష్ట్రపతి పాలన కొనసాగుతోందని దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు,నాయకులు మసలు కోవాలని కోరారు. -
‘తీర్పు’ ఇచ్చేశాం..!
‘సార్వత్రిక’ సమరం ముగిసింది. స్వల్ప ఘటనలు మినహా జిల్లాలో శాంతిభద్రతలు ఎక్కడా అదుపు తప్పలేదు. పటిష్ట ప్రణాళికతో జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్, ఎస్పీ నాగేంద్రకుమార్ వ్యవహరించి ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తీర్పు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. ఈవీఎంల మొరాయింపు ఈ ఎన్నికల్లో అతి పెద్ద సమస్యగా మారింది. దీనితో కొన్నిచోట్ల పోలింగు ఆలస్యంగా ప్రారంభమైంది.అయితే అధికారుల కృషి మేరకు పోలింగు పెరగడం విశేషం. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సాధారణ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో చెదురుమదురు ఘటనలు మాత్రమే అక్కడక్కడ నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 74.34శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా కల్వకుర్తిలో 83.87 శాతం, అత్యల్పం కొడంగల్‌లో 65.61 శాతం ఓట్లు పోలయ్యాయి. షాద్‌నగర్, గద్వాల నియోజకవర్గాల్లోనూ 80శాతంకు పైగా పోలింగ్ నమోదైంది. 3268 పోలింగ్ బూత్‌లకు గాను 75 చోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయించడంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. అత్యధికంగా జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో పదేసి బూత్‌లలో ఈవీఎంలు పనిచేయక పోవడంతో ప్రత్యామ్నాయ ఈవీఎంలను ఏర్పాటు చేశారు. 84శాతం మేర పోలింగ్ నమోదవుతుందని అధికారులు అంచనా వేసినా 74.34శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు స్వస్థలాలకు రాకపోవడం వల్లే పోలింగ్ శాతం ఆశించిన మేర నమోదు కాలేదని పోలింగ్ సరళి వెల్లడించింది. ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 73.02శాతం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 78.25శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. 2009 ఎన్నికల్లో 69శాతం మాత్రమే ఓట్లు పోల్ కాగా, ప్రస్తుతం 5.34శాతం మేర పోలింగ్ పెరిగింది. హైదరాబాద్ నుంచి అభ్యర్థులు సమకూర్చిన బస్సులు, మినీ వ్యాన్లతో పాటు ద్విచక్ర వాహనాలపై ఓటర్లు సొంత ప్రాంతాలకు రావడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన కొల్లాపూర్, అచ్చంపేటలో సాయంత్రం ఐదు గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా నియోజకవర్గాల్లో ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగడంతో గడువు ముగిసిన తర్వాత ఎక్కడా ఓటర్లు బారులు తీరి కనిపించలేదు. ఎండ తీవ్రత మూలంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకే 52.05శాతం ఓటర్లు ఓటు వేసి వెళ్లారు. పోలీసులు లాఠీలకు పని... పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఇరువర్గాలు ఘర్షణలకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తతలు తలెత్తాయి. పోలీసులు సకాలంలో జోక్యం చేసుకుని లాఠీలు ఝలిపించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘర్షణలకు సంబంధించి ఎనిమిది ఘటనలు చోటు చేసుకోగా, గద్వాల నియోజకవర్గం మల్దకల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మిగతా ఘటనలపై విచారణ తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు. గద్వాల కోటలోని పోలింగ్ స్టేషన్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాలు ఘర్షణకు దిగాయి. అభ్యర్థులు డీకే అరుణ (కాంగ్రెస్), కృష్ణమోహన్‌రెడ్డి (టీఆర్ఎస్) కూడా అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితి అదుపు చేశారు. కొడంగల్‌లోనూ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి సమక్షంలోనే గొడవ జరగడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆత్మకూరు మండలం గోపన్‌పేటలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. కొల్లాపూర్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య జరిగిన ఘర్షణల్లో కాంగ్రెస్ నాయకుడు గాయపడ్డాడు. ధన్వాడ మండలం మరికల్లో పోలీసులు లాఠీ ఝలిపించడంతో ఓ గర్భిణికి దెబ్బలు తగలడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూలు మండలం నాగనూలులో పోలీసుల వైఖరిని నిరసిస్తూ గ్రామస్తులు పోలీసు జీపును అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఫరూఖ్‌నగర్ మండలం విట్యాలలో మతి స్థిమితం లేని వ్యక్తితో ఓటు వేయించారని ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారికి పాముకాటు కేశంపేట మండలం దేవునిగుట్ట తండాలో ఎన్నికల అధికారి ఊషయ్య మంగళవారం రాత్రి పాముకాటుకు గురయ్యారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఊషయ్యను తొలుత షాద్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి, ఆ తర్వాత అపోలో ఆసుపత్రికి తరలించారు. బాలానగర్ మండలం దోన్లెపల్లి మధిర గ్రామం చొక్కంపేటకు చెందిన 300కు పైగా ఓటర్లు మధ్యాహ్నం వరకు పోలింగ్ బహిష్కరించారు. తమ గ్రామంలో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేస్తేనే ఓటు వేస్తామంటూ నిరసనకు దిగారు. చివరకు మధ్యాహ్నం గ్రామానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు వచ్చే ఎన్నికల్లో స్థానికంగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో పోలింగ్‌లో పాల్గొన్నారు. -
సామాజిక చైతన్యం రావాలి
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: సామాజిక స్వాతంత్య్రం సాధించాలని, అప్పుడే బడుగులు అభివృద్ధి చెందుతారని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అన్నారు. సాంఘి క సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాజ్యంగ నిర్మాత, దళిత ఆశాజ్యోతి బీఆర్ అంబేద్కర్ 124జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక కొత్త బస్టాండ్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక చైతన్యం రావాలని, అప్పుడే హక్కులను సాధించుకోవచ్చన్నారు. ప్ర పంచ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఒక్క గొప్ప రాజ్యాంగా న్ని దే శానికి అందించిన ఘనత అం బేద్కర్‌కే దక్కిందన్నారు. అణగారి ని వర్గాల అభ్యున్నతి కోసం రా జ్యాంగంలో అనేక హక్కులను క ల్పించిన మహావ్యక్తి అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, చదువు ద్వారానే మనకు గు ర్తింపు వస్తుందన్నారు. సమాజంలో నెలకొన్న మూఢ నమ్మకాలు, దురాచారాలను రూపుమాపాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చదువు కోసం అనేక పథకాలను అమలు చేస్తుంద ని తెలిపారు. బడిబయట పిల్లలను బడిలో చేర్పించేందుకు కృషి చేయాలన్నారు. మహనీయుల ఆశయ సాధన కోసం అందరూ ప్రయత్నిం చాలని సూచించారు. కార్యక్రమం లో ఎస్పీ నాగేంద్రకుమార్, జేసీ శర్మణ్, డీఆర్డీఏ పీడీ చంద్ర శేఖర్‌రెడ్డి, ఆర్డీఓ హనుమంత్‌రావు, సోషల్ వెల్ఫేర్ డీడీ జయప్రకాష్, డీఎస్‌డబ్ల్యూఓ శ్రీనివాస్‌రావు, ఏ ఎస్‌డబ్ల్యూఓ రాములు అధికారులు సత్యనారాయణ, సబిల్, జీవన్, చంద్రశేఖర్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా పోలీసుల పనితీరు భేష్!
మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు వల్లే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడిందని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అదనపు డీజీపీ, ఎన్నికల పరిశీలకులు ఎస్ఆర్ ఓజా ప్రశంసించా రు. శనివారం ఆయన జిల్లా పోలీసు కార్యాల యాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయ న జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌తో సమావేశ మై, ఎన్నికల పర్యవేక్షణపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలో 80శాతం పోలింగ్ కావడంలో పోలీసులు పాత్ర ప్రశంసనీయమన్నారు. అనంతరం ఆయన కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన ఎన్నికల పోలీసు కంట్రోల్ రూంను సందర్శించారు. ఎన్నికల సందర్భంగా వస్తున్న ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు. డయల్ 100 నంబర్‌కు వస్తున్న ఫిర్యాదులను, కంప్యూటర్లో రికార్డుల్లో నమోదును పరిశీలించారు. డబ్బు, మద్యం పంపిణీకి సంబంధించిన కేసుల నమోదు వివరాలు అడిగారు. పోలీసులకు అందిన ఫిర్యాదులను ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లయింగ్ స్క్వాడ్‌కు క చ్చితంగా చేర వేయాలని సూచించారు. దీంతో పనిలో వేగవంతం అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎన్నికల వింగ్ అధికారి రామ్మూర్తి, పీఆర్ఓ రంగినేని మన్మోహన్, తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించాలి కలెక్టరేట్: కలె క్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూంను ఓజా తనిఖీ చేశారు. ప్రతిష్టాత్మకంగా నిర్విహ స్తున్న ఎన్నికల పట్ల ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దన్నారు. వచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలించాలన్నారు. ఎవరికి కేటాంచిన విధులను వారు పకడ్బందీగా చేపట్టేందుకు కృషి చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై ఈసీ నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. కొడంగల్ టీడీపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి సంబంధించి నమోదు చేసిన ఫిర్యాదును ఆయన పరిశీలించారు. బరిలో ఉండే అభ్యర్థులు ప్రచారంలో ఎక్కడైనా నిబంధనలకు ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించాలని ఆదేశించారు. కంట్రోల్ రూంకు వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నామని ఈ సందర్భంగా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం.గిరిజాశంకర్, జే సీ శర్మన్‌లు ఆయనకు వివరించారు. సిబ్బందిని సైతం అప్రమత్తం చేస్తున్నామని, ప్రస్తుతం పెండింగ్‌లో ఎలాంటి సమస్యలు లేవన్నారు. కార్యక్రమంలో కంట్రోల్ రూం ఇన్చార్జి రమణాచారి, సూపరింటెండెంట్ చంద్రకాంత్ రెడ్డి, సీ-సెక్షన్ తహశీల్దార్ చందర్రావు, ఏఓ కృష్ణకుమార్ పాల్గొన్నారు. -
పోలీస్...అటెన్షన్..!
కత్తిమీద సాములా మారిన ఎన్నికల పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ పోలీసు యంత్రాంగం ప్రజల నమ్మకాన్ని పొందాలని ఎస్పీ నాగేంద్రకుమార్ సిబ్బందికి సూచించారు. తక్షణ స్పందనతో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలన్నారు. విధుల పట్ల అప్రమత్తత, సున్నిత అంశాల పట్ల అవగాహన ముఖ్యమన్నారు. మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: సంఘ వ్యతిరేక శక్తుల పట్ల కఠిన వైఖరి, అరాచక శక్తుల పట్ల గట్టి నిఘా, అల్లరి మూకల నియంత్రణ లక్ష్యంగా ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా ఎస్పీడి. నాగేంద్రకూమార్ వారికి దిశానిర్దేశం చేశారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసుల దృష్టికి వచ్చిన ఫిర్యాదుల పట్ల చట్టబద్ధతతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాల వివరాలు మన వద్ద ఉన్నాయని, ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించటం, గొడవలు సృష్టించే వారెంతటి వారైనా ఉపేక్షించక కేసులు నమోదు చేయటం వల్ల పరిస్థితులు అదుపులో ఉంటాయని తెలిపారు. మరికొన్ని బలగాలు శుక్రవారం జిల్లాకు చేరుకుంటాయని, సిబ్బంది వినియోగంలో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. గతంలో జిల్లా మావోయిస్టు ప్రభావితమైనదనే విషయాన్ని మరువరాదని అనుభవజ్ఞులైన సిబ్బంది, అనుకూలమైన వ్యక్తుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెక్‌పోస్టులు, పెట్రోలింగ్ వాహనాల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది వద్ద సంబంధిత పోలీస్స్టేషన్ల, అత్యవసరమైన ఫోన్ నెంబర్లు ఉండేలా చూడాలని సూచించారు. తక్షణ స్పందన వల్లే పోలీసు పట్ల ప్రజలకు నమ్మకం కుదురుతుందన్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో చేపట్టిన చర్యలను వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు, నిఘా చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని తెలిపారు.స్థానిక ఎన్నికల నేపధ్యంలో ఈ నెల 6న నాగర్‌కర్నూల్ ఎంపీ నియోజకర్గ పరిధిలో తొలి విడతగా జరిగే 35 మండలాలకు 325 వాహనాలను సమాకూర్చుతున్నట్లు తెలిపారు. ఆధికారులకు 45 ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉంచామన్నారు. ఈ వాహనాల్లో పెట్రోలింగ్ స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఆధికారుల తనిఖీల వింగ్‌ల ఏర్పాటు చేశామన్నారు. మాజీ సైనికుల సేవలు అవసరం సార్వత్రిక, జెడ్పీటీసీ ఎన్నికల్లో మాజీ సైనికుల సేవలు అవసరమని జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ అన్నారు. జిల్లాలో ఉన్న సివిల్, సాయుధ, ప్రత్యేక బలగాలకుతోడుగా హోంగార్డులను, ఫారెస్టు, ఆబ్కారీశాఖకు చెందిన సిబ్బంది ఇప్పటికే విధుల్లో ఉన్నారని, సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్, ఏపీఎస్పీకి చెందిన బలగాలు రానున్నాయన్నారు. ఎన్నికల సందర్భంగా మాజీ సైనికుల సేవలను వినియోగించుకోవడానికి నిర్ణయించామన్నారు. అరవై ఏళ్లలోపు వయస్సు గల మాజీ సైనికులు ఎన్నికల విధులు నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న వారు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని రిజర్వు ఇన్పెక్టర్ల కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. వారికి గౌరవ వేతనం అందిస్తామని తెలిపారు. గతంలో జరిగిన ఎన్నికల సందర్బంగా వారు చక్కటి సేవలు అందించారని ఎస్పీ గుర్తుచేశారు. -
రెడీ.. స్టడీ..!
ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు వేగం పెంచారు. కలెక్టర్ గిరిజాశంకర్, ఎస్పీ నాగేంద్రకుమార్ సమీక్షలతో అధికారులకు మార్గదర్శనం చేస్తున్నారు. మరో వైపు ‘నిబంధనలను’ రాజకీయ పక్షాలవారికి చెప్పి లక్ష్మణరేఖలు విధిస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పోలీసు బందోబస్తును సమకూర్చుతున్నారు. వాటిపై వీడియోల డేగ కన్ను తప్పదని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నెంబర్లతో ఓటర్లతో సంబంధాలకు ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా ఎనిమిది పురపాలికల్లో జరగనున్న ఎన్నికల్లో ఫిబ్రవరి 28న నాటికి ఓటరుగా నమోదు చేసుకొన్న వారికే ఓటు హక్కు లభిస్తుంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ వెల్లడించారు. శుక్రవారం స్థానిక రెవెన్యూ సమావేశ మం దిరంలో ఆయన వివిధ రాజకీయ పక్షాల నేతలకు ఎ న్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ చెప్పిన మేరకు... ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా, దరఖాస్తు చేసుకొన్న వారికి మాత్రమే అవకా శం ఉంటుంది. ఈ అనుబంధ జాబితాను ఈ నెల 10 న విడుదల చేసి ఆయా వార్డులకు జతపరుస్తారు. ఈ ఎన్నికలకు 344పోలింగ్ బూత్‌లతోపాటు, ప్రతీ నా లుగు వార్డులకో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల ని యామకాన్ని పూర్తి చేశారు. వీరే ఆయా వార్డుల్లో నా మినేషన్లను స్వీకరిస్తారు. విచారణను సైతం పూర్తి వా రే నిర్వహిస్తారు. వార్డు అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ. ల క్షకు మించరాదు.దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. ఒక వేళ నిబంధనల ప్రకారం అభ్యర్థి ఖర్చు మించితే, వారిని అనర్హులుగా ప్రకటిస్తారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా వీడియో చిత్రీకరణతోపాటు, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్....... ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక టోల్ ఫ్రీ నెం బర్ 9866098111ను ఏర్పాటు చేశారు. కం ప్యూటర్తో అనుసంధానం చేసిన ఈసెల్‌కు న లుగురు సిబ్బంది ఉంటారు. వీరు నమోదు చే సుకొన్న ఫిర్యాదులను ప్రత్యేక బృందాలకు స మాచారాన్ని తెలియజేస్తారు. ఇందుకుగాను నా లుగు ప్రత్యేక బృందాలను నియమించారు. వీ రు కేవలం ఫిర్యాదుల స్వీకరణకే పనిచేస్తారు. దీంతోపాటు కంట్రోల్ రూం ఏర్పాటు చేసి 08542-241200 నెంబర్‌ను కేటాయించారు. ఎన్నికల అనంతరం ఈవీఎంలను భద్రపరిచేం దుకు స్ట్రాంగ్ రూంలను ఎంపిక చేశారు. కౌం టింగ్ వరకు పటిష్టమైన భద్రత ఉంటుంది. ఇక డబ్బు, మద్యం, ఇతరత్రా వాటితో ఓ టర్లను ప్రలోభానికి గురిచేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నే తలు వివిధ సూచనలు చేశారు. సార్వత్రానికీ రెడీ.. అనంతరం పార్లమెంట్, శాసన సభ సాధారణ ఎన్నికల నిర్వహణా ఏర్పాట్లను కూడా కలెక్టర్ సమీక్షించారు. ఏప్రిల్ 2నుంచి 9వరకు చేపట్టే నామినేషన్లకు అంతా సిద్దం చేశామన్నారు. ఈఎన్నికల్లో నామినేషన్లు ముగిసేలోగా ఓటరుగా నమోదు చేసుకొన్న వారందరికి ఓటు హక్కు కల్పిస్తారు. అదే విధంగా, 18-19వయస్సు వారు జిల్లాలో 3లక్షలకు పైగా నమోదు చేసుకొన్నారు. వారికి ఎపిక్ కార్డుల్ని ఇంటింటికెళ్లి అందజేసి, వారి నుంచి రశీదులు తీసుకొంటారు. ఈఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులకు పార్లమెంట్‌కు రూ.70, అసెంబ్లీకి రూ.30లక్షలు మించి ఖర్చు చేయరాదు. ఇక ప్రచారం, బహిరంగ సభలు, ఇతరత్రా వాటన్నింటిని అభ్యర్థి ఖాతాల్లోనే జమచేసి లెక్కిరు. ప్రస్తుతం నిర్వహించే ఎన్నికల్లో 1500 మంది ఓటర్లు దాటితే అదనంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇందుకు వివరాలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు. ఈ ఎన్నికలకు సంబంధించి 3,248పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. పోలింగ్‌ను వెబ్‌కాస్టింగ్‌లో పర్యవేక్షిస్తారు. ఇబ్బందులు తలెత్తిన తక్షణమే పరిష్కరించేందుకు సరిపడా బృందాలను ఏర్పాటు చేశారు. ఇక నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థులకు జిల్లా, రాష్ట్రం, దేశంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఆస్తులున్నా సమాచారం ఇవ్వాలి. ఏదైనా సమాచారం ఇవ్వకుండా నామినేషన్ వేస్తే వాటిని తిరస్కరిస్తారు. 200మందిని బైండోవర్...... ఎన్నికల దృష్ట్యా వివిధ కేసుల్లో ఉండి రౌడీ షీటర్లుగా గుర్తింపు ఉను 200మందిని బైండోవర్ల కింద అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ వెల్లడించారు. ఇక లెసైన్స్ వెపన్లు కలిగి ఉన్న వారు ఇది వరకే 90శాతం మంది డిపాజిట్ చేశారని, మిగిలిన వారు రెండు రోజుల్లో చేసేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. అంతర్రాష్ట్ర రహదారులపై 22, జిల్లాలో అదనంగా 20కిపైగా చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇక నుంచి బహిరంగ సభలు, ర్యాలీలు, వాహనాలకు మైక్ తదితర వాటికి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. మున్సిపల్, సాధారణ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని, గతంలో మాదిరి కాకుండా, ఈసారి పోలీసులపై రెవెన్యూ అధికారి పర్యవేక్షిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జేసి ఎల్.శర్మన్, డీఅర్వొ రాంకిషన్, డిఅర్డిఏ పీడీ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అమరయ్యతోపాటు, డిసిసి అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, సీపిఐ జిల్లా కార్యదర్శి కిల్లె గోపాల్‌తోపాటు, ఇతర పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు. -
విరిగిన లాఠీ... పేలిన తుపాకీ
పెరిగిన నిత్యావసర ధరలు, కంట తడిపెట్టిస్తున్న కూరగాయలు, సగటు మనిషి జీవనం ఇబ్బందికరంగా మారడంతో నిరసన తెలిపేందుకు వివిధ రాజకీయ పక్షాల నేతృత్వంలో గళమెత్తిన ప్రజల పట్ల పోలీసులు తమదైన శైలిలో వ్యవహరించారు. శుక్రవారం పోలీసు పరేడ్ గ్రౌండ్‌కు సమీపంలో మధ్యాహ్నం 12.10నిమిషాలకు జరిగిన ఈ సంఘటన ప్రజా సంఘాలను కలచి వేసింది. తమ సమస్యలపై నినదిస్తూ ర్యాలీగా వస్తున్న ఆందోళనకారులను అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో మండిపడిన ఉద్యమకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అప్రమత్తమైన ఏఆర్ డీఎస్పీ భరత్ వారిని హెచ్చరించారు. కొంతమంది పోలీసులు లాఠీలు ఝలిపించి ముందుకు ఉరికే ప్రయత్నం చేశారు. ఆగ్రహించిన ప్రజలు వారిపై రాళ్లు రువ్వారు. కట్టెలతో ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనతో రెచ్చిపోయిన పోలీసులు లాఠీచార్జికి ఉపక్రమించారు. మరో మారు హెచ్చరికలు చేసి టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇది మరీ ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రతిఘటన తీవ్రమైంది...వెంటనే పోలీసులు నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా ప్రజాసంఘాల వారు తగ్గలేదు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో వారిని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. దీనితో ‘కాప్స్’ నేరుగా కాల్పులకు దిగారు. ఈ సంఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. మిగతావారు పరుగులు తీశారు. అక్కడ భీకర యుద్ధవాతావరణం తలపించింది. పోలీసుల బలప్రయోగంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఎస్పీ నాగేంద్రకుమార్ రంగంలోకి దిగి చక్కదిద్దారు. మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: మరి కొన్ని వారాల్లో పోలీసు శాఖలోకి ఉన్నతాధికారులుగా బాధ్యతలు చేపట్టనున్న ట్రైనీ ఐపీఎస్‌లకు జిల్లాకేంద్రంలోని పోలీసు మైదానంలో ఇక్కడి పోలీస్ యంత్రాంగం వివిధ అంశాలపై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చింది. హైద్రాబాద్‌లోని శివరాంపల్లి సర్దార్ వల్లభాయి పటేల్ నేషనల్ పోలీసు శిక్షణ అకాడమీలో ఇండియన్ పోలీసు సర్వీసెస్‌లో శిక్షణ పొందుతున్న 66వ బ్యాచ్‌కు చెందిన 161 మందిలో శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాకు 51 మంది ట్రైనీ ఐపిఎస్‌లు వచ్చారు. వారికి ఉన్నాతాధికారులు పోలీసు వ్యవస్థపై ఆవగాహన కల్పించారు. పోలీసు చట్టాలు, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర, ప్రజలతో సంబంధాలు, నేరాలను అదుపు చేసేందుకు తీసుకునే చర్యలు, పోలీసు సంక్షేమనికి తీసుకోవలసిన ప్రణాళికలు వంటి వివిధ అంశాలపై బోధించారు.జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అల్లర్లు, ధర్నాలు చోటు చేసుకుంటే వాటిని ఎలా ఎదుర్కోవాలో పోలీసులే రెండు జట్లుగా విడిపోయి మాక్ లాఠీచార్జి, ఫైరింగ్, టియర్ గ్యాస్ ప్రయోగం వంటివి చేసి ఆందోళనను కళ్లకు కట్టినట్లు చూపారు. దీంట్లో ఒక ృందం పోలీసులు అచ్చం ప్రజా సంఘాల వారిగా వేషాలు వేసుకొని ఆందోళన చేపట్టారు. ఈ అంశం ట్రైనీ ఐపీఎస్‌లను విశేషంగా ఆకట్టుకుంది. ఆకట్టుకున్న డాగ్‌స్క్వాడ్... డాగ్‌స్కాడ్‌తో నిర్వహించిన పేలుడు పదార్థా ల గుర్తింపు , వాటిని నిర్వీర్యం చేయడం సవి వరంగా చూపారు . అనంతరం డీసీఆర్బీ వి భాగంలోని పోలీస్ వ్యవస్థకు అనుసంధానం చేసిన వ్యవస్థను క్షుణంగా ట్రైనీలు పరిశీలించారు. ఎస్బీ శాఖాధికారులతో నేరాల అదుపులోకి తీసుకుంటున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం వన్‌టౌన పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఎఫ్ఐఆర్ల నమోదు, ఫి ర్యాదుల స్వీకరణ వంటి అంశాలతోపాటు మహిళలకు రక్షణగా ఏర్పాటు చేసిన రక్షిత అప్లికేషన్ వివరాలను తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ భేష్... అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావే శంలో జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్తోపాటు ఎస్పీ నాగేంద్రకుమార్ సమావేశమయ్యారు. పౌరుల హక్కులు, ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పాటు చేసిన చట్టాలపై ప్రత్యేకంగా కలెక్టర్ వారితో చర్చించారు. తర్వాత పిల్లలమర్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ట్రేనర్ డీఐజీ ప్రవీణ్కుమార్సిన్హా మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ నేరాలను అదుపు చేయడంతోపాటు శాంతిభద్రతలు కాపాడడంలో ముందంజలో ఉందని చెప్పారు. సమాజంలో శాంతిభద్రతలు కాపాడడమే పోలీసుల ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్‌లు కొందరు ‘నూస్లైన్’ వద్ద తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వారి మాటల్లోనే... మహిళలల ప్రాధాన్యం పెరగాలి మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు సర్వసాధారణం అయ్యాయి. వీటిని నిరోధించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వారికి రక్షణగా మహిళా అధికారులే పోలీస్ శాఖలోఉంటే బాధితులకు త్వరితగతిన న్యాయం చేసే వీలు కలుగుతుందనే ఆశయంతోనే పోలీసు శాఖలో చేరాను. - ఇందిరాముఖర్జీ, కోల్‌కత ప్రజలకు సేవచేసేందుకే.. పోలీస్‌శాఖలో ఉన్నత అధికారుల స్థానంలో ఉంటే ప్రజలకు నేరుగా సేవలందించవచ్చనే ఈ శాఖలో చేరాను. యువత కూడా చెడుమార్గాలవైపు పయనించకుండా సమాజానికి సేవ చేసే భాగ్యం పోలీస్‌శాఖలో కలుగుతుందని గుర్తించాలి. ప్రతి ఒక్కరు ఆ దిశగా కృషి చేయాలి. - రాహుల్తిరుపతి, అయోధ్య, ఉత్తరప్రదేశ్ నా తండ్రి కల సాకారమైంది.. నాకు ఇంజనీర్ కావాలని ఉన్నా మా నాన్నకు నన్ను పోలీసు అధికారిని చేయాలని ఉండేది. తనకు పోలీస్ వృత్తి అంటే చాలా ఇష్టం. ఆ మేరకు ఇంజనీరింగ్‌ను పక్కకు పెట్టి కష్టమైన పోలీస్ శాఖలో ఉన్నత అధికారి కావాలనే నా తండ్రి అశయం కోసం ఈ ఉద్యోగం సాధించాను. కష్టపడి చదివితే సాధించలేనిది లేదనే విషయాన్ని రుజువు చేశాను. - రామకృష్ణ, విజయవాడ డ్రస్సుపై మమకారంతోనే.. పోలీసు డ్రస్సుపై మమకారంతో ఈ శాఖలోకి రాావాలనుకున్నా. అందుకే ఐపీఎస్‌కు ప్రిపేర్ అయి సెలెక్ట్ అయ్యాను. సమాజంలో మార్పులు తెచ్చేందుకు నా వంతు కృషి చేస్తాను. పోలీస్ వ్యవస్థ అంటే ప్రజల్లో ఉన్న భయాన్ని పూర్తిగా తొలగించి ప్రజలకు పోలీస్ వ్యవస్థను దగ్గరికి చేరుస్తా. పోలీస్ చేరుందుకు మహిళలు ఎటువంటి భాయాందోళనకు లోను కావాల్సిన అవసరం లేదు. - దివ్య, తమిళనాడు -
నేరాల అదుపునకు ట్రాకింగ్ సిస్టమ్
మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: జిల్లాలో నేరాల అదుపునకు, పోలీసుల పనితీరును నియంత్రించేందుకు అధునాతనమైన ‘బీట్‌పోలీస్ ట్రాకింగ్ సిస్టమ్’ను అమలు చేయనున్నట్లు జిల్లా ఎ స్పీ నాగేంద్ర కుమార్ శుక్రవారం వెల్లడించారు. స్థానిక ఎస్పీ కా ర్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ట్రా కింగ్ విధానాన్ని గూగుల్‌కు అనుసంధానం చేయనున్నట్లు తెలి పారు. రాత్రి వేళల్లో గస్తీ తిరిగే పోలీస్ సిబ్బంది పనితీరును సమీక్షించేందుకు వీలవుతుందన్నారు. బీట్ నిర్వహించే ప్రతీ పోలీస్వద్ద ఓ మొ బైల్ ఫోన్ ఉంటుందని దానిని పోలీస్ శాఖతోపాటు , గూగుల్‌కు అనుసంధానం చేస్తారన్నారు. ఇలా ప్రమాదకర సంఘటనలు, హత్యలు, మహిళలపై లైంగిక వే దింపులు, ఈవ్ టీజంగ్లకు పాల్పపడే వాటిలో బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా తమ టీం పని చేస్తుందన్నారు. ప్రతి రోజు విధు ల్లో ఉన్న పోలీసులు ఈ మోబైల్ ద్వారా రౌడీషీటర్లు, పాతనేరస్తులతోపాటు నింది తుల ఫోటోలను తీస్తారన్నారు. ఈ ఫోటోలను తక్షణమే గూగుల్‌లో నిక్షిప్తం కావడం వల్ల నేరాలను అదుపు చేయవచ్చన్నారు. రక్షిత ఆప్స్ నెట్వర్కింగ్ కూడా... బాలికలకు, మహిళలకు రక్షణ కల్పించేం దుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రక్షిత ఆప్స్నెట్వర్కింగ్ సిస్టమ్‌ను ప్రారభించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఇం దులో భాగంగా త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, బాలికలపై జ రుగుతున్న అఘాయిత్యాలను నిరోధిం చేందుకు ఈ నెట్‌వర్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బాధితులు తమకు ఆ పద ఉన్నట్లు అనుమానం వచ్చిన వెంటనే 119 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలని సూచించారు. తమ తమ సెల్ఫోన్లకు రక్షిత ఆప్స్‌ను వెబ్సైట్ ద్వారాగాని స్థానిక పోలీస్స్టేషన్ల ద్వారా గాని డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. దీని వల్ల భవిష్యత్తులో నేరాలను అదుపు చేసేందుకు పటిష్టమైన చర్యలతోపాటు బాధితులకు పోలీ స్ శాఖ అండదండగా ఉంటుందన్నారు. బాలికలపై లైంగిక వేధింపులు గాని ప్రేమ పేరిట బెదిరింపులు, ైమైనర్లను ఎత్తుకెళ్ల డం వంటి వారిపై నిర్భయ చట్టం కన్న కఠినంగా ఉన్న పాక్సొ చట్టం కింద అరె స్టు చేస్తామన్నారు. ఈ కేసులో నిందితులుగా తేలితే కచ్చితంగా పదేళ్లకు పైగా కఠినకారాగార శిక్ష తప్పదన్నారు. దీనిపై పాఠశాలలో, కళాశాలలో, హాస్టళ్లలో విస్తృ త ప్రచారం నిర్వహించేందకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ప్రదీప్‌రెడ్డి, డీఎస్పీ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. డీజీపీచే పలు ప్రారంభోత్సవాలు రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. ప్ర సాదరావు శనివారం జిల్లాలో పర్యటించనున్నారని ఎస్పీ తెలిపారు. ఈ మేరకు జి ల్లాలోని పలు ప్రాంతాల్లో కొత్తగా నిర్మించి న పీఎస్‌లతోపాటు మరొకొన్ని కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కొత్తూరు ప్రాంతంలో నిర్మించి న షాద్‌నగర్ రూరల్ పీఎస్, పెద్దమందడిలో కొత్తగా నిర్మించిన పోలీస్సేష్టన్తోపాటు జిల్లా కేంద్రంలోని సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రూ. కోటి నిధులతో నిర్మిస్తున్న డీపీఓ కా ర్యాలయం, రూ. 70 లక్షలతో నిర్మిస్తున్న కంట్రోల్ రూమ్, రూ. 75 లక్షలతో ట్రా ఫిక్ పీఎస్ భవనాలను శంకుస్థాపన చేస్తారన్నారు. దీంతోపాటు పోలీస్ క్యాంటీన్ స్టోర్‌ను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. -
ఈ వయసులో ఆ చికిత్స సాధ్యమేనా?
నా వయసు 32. నాకు పై దవడలో ఉన్న కోరపళ్లు కొద్దిగా వెనక్కి ఉన్నాయి. వాటిని సరిచేయించుకోవాలని ఉంది. దీనికోసం నేను ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. సిరామిక్ బ్రేసెస్ విధానం గురించి విన్నాను. ఈ వయసులో ఈ చికిత్స సాధ్యమేనా? ఈ ట్రీట్మెంట్కి ఎంతకాలం పడుతుంది? బ్రేసెస్ వేయించుకున్న తరవాత పళ్లు నార్మల్ కావడానికి ఎన్నిరోజులు పడుతుంది. మరో మూడునెలల్లో నా పెళ్లి. అప్పటికినా ట్రీట్మెంట్ పూర్తవుతుందా? నాకు తగిన సలహా, సూచనలు ఇవ్వగలరు. - నాగేంద్రకుమార్, కొత్తగూడెం వెనుకగా ఉన్న మీ పళ్లను ముందుకు తీసుకురావడం సాధ్యమే. అయితే ఈ చికిత్సకి సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది. ముందుగా కొన్ని పరీక్షలు చేయవలసి ఉంటుంది. ఎక్స్‌రే తీసి నిర్ధారణ చేయవలసి ఉంటుంది. అలాగే మౌల్డ్స్ గురించి చికిత్స ప్రారంభించడానికి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మూడు నెలలలో చికిత్స చేయడమనేది అసాధ్యం. మీ పలువరుస సక్రమంగా లేకపోతే మాత్రం మీ దవడలకు కాస్మొటిక్ సర్జరీ లేదా ఆర్థోనాటిక్ సర్జరీ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఈ చికిత్స అనివార్యమయితే, మీరు తప్పనిసరిగా మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్‌ని సంప్రదించవలసి ఉంటుంది. ఈ విధానం వల్ల చికిత్స నూటికినూరు శాతం సక్సెస్ అవుతుంది. ఈ చికిత్స చేసేవారు హైదరాబాదు నగరంలో చాలామంది ఉన్నారు. చాలా సందర్భాలలో సర్జరీకి ముందు, తరవాత కూడా కొద్ది కాలం పాటు క్లిప్పులను ఉపయోగించవలసి ఉంటుంది. మంచి మంచి పరికరాలు, మంచి వైద్యవిధానం మనకి అందుబాటులో ఉంది. చాలామందికి ఈ విధానం వల్ల చాలా సమస్యలు వస్తాయని, అంతేకాక పరిస్థితి చాలా దయనీయంగా మారుతుందనే అపోహ ఉంది. ఇది ఎంతమాత్రం వాస్తవం కాదు. ఈ చికిత్స వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగవు. దీని గురించి తెలియనివారు చెప్పే మాటలను వినకండి. మీరు సరయిన మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్‌ని కలిస్తే అన్ని అపోహలు తొలగిపోతాయి. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేయటం వల్లే ప్రమాదం
-
బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేయటం వల్లే ప్రమాదం: ఎస్పీ
మహబూబ్ నగర్ : వోల్వో బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేయటం వల్లే ప్రమాదం జరిగిందని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ నాగేంద్ర కుమార్ తెలిపారు. క్లీనర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట సమీపంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు (AP 02 TA 0963) ఘోర ప్రమాదానికి గురైంది. ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 45మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాదం జరిగిన బస్సులో 49మంది ప్రయాణిస్తున్నారు. అయితే కేవలం అయిదుగురు మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. మిగతవారు సజీవ దహనం తెలుస్తోంది. కాగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు.