పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని గామన్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని గామన్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక అచ్చాయమ్మకాలనీకి చెందిన చినరావూరి సుబ్బారావు కుమారుడు నాగేంద్రకుమార్(28) శుక్రవారం గామన్ బ్రిడ్జిపై నుంచి దూకి, అరికిరేవులపాడు రోడ్డుపై పడ్డాడు. ముఖానికి తీవ్రగాయాలు కావటంతో అక్కడికక్కడే చనిపోయాడు. అయ్యప్ప దీక్షలో ఉన్న నాగేంద్రకుమార్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.