ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు వేగం పెంచారు. కలెక్టర్ గిరిజాశంకర్, ఎస్పీ నాగేంద్రకుమార్ సమీక్షలతో అధికారులకు మార్గదర్శనం చేస్తున్నారు. మరో వైపు ‘నిబంధనలను’ రాజకీయ పక్షాలవారికి చెప్పి లక్ష్మణరేఖలు విధిస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పోలీసు బందోబస్తును సమకూర్చుతున్నారు. వాటిపై వీడియోల డేగ కన్ను తప్పదని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నెంబర్లతో ఓటర్లతో సంబంధాలకు ఏర్పాట్లు చేశారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా ఎనిమిది పురపాలికల్లో జరగనున్న ఎన్నికల్లో ఫిబ్రవరి 28న నాటికి ఓటరుగా నమోదు చేసుకొన్న వారికే ఓటు హక్కు లభిస్తుంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ వెల్లడించారు. శుక్రవారం స్థానిక రెవెన్యూ సమావేశ మం దిరంలో ఆయన వివిధ రాజకీయ పక్షాల నేతలకు ఎ న్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ చెప్పిన మేరకు... ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా, దరఖాస్తు చేసుకొన్న వారికి మాత్రమే అవకా శం ఉంటుంది. ఈ అనుబంధ జాబితాను ఈ నెల 10 న విడుదల చేసి ఆయా వార్డులకు జతపరుస్తారు.
ఈ ఎన్నికలకు 344పోలింగ్ బూత్‌లతోపాటు, ప్రతీ నా లుగు వార్డులకో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల ని యామకాన్ని పూర్తి చేశారు. వీరే ఆయా వార్డుల్లో నా మినేషన్లను స్వీకరిస్తారు. విచారణను సైతం పూర్తి వా రే నిర్వహిస్తారు. వార్డు అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ. ల క్షకు మించరాదు.దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. ఒక వేళ నిబంధనల ప్రకారం అభ్యర్థి ఖర్చు మించితే, వారిని అనర్హులుగా ప్రకటిస్తారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా వీడియో చిత్రీకరణతోపాటు, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు.
ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్.......
ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక టోల్ ఫ్రీ నెం బర్ 9866098111ను ఏర్పాటు చేశారు. కం ప్యూటర్‌తో అనుసంధానం చేసిన ఈసెల్‌కు న లుగురు సిబ్బంది ఉంటారు. వీరు నమోదు చే సుకొన్న ఫిర్యాదులను ప్రత్యేక బృందాలకు స మాచారాన్ని తెలియజేస్తారు. ఇందుకుగాను నా లుగు ప్రత్యేక బృందాలను నియమించారు. వీ రు కేవలం ఫిర్యాదుల స్వీకరణకే పనిచేస్తారు. దీంతోపాటు కంట్రోల్ రూం ఏర్పాటు చేసి 08542-241200 నెంబర్‌ను కేటాయించారు. ఎన్నికల అనంతరం ఈవీఎంలను భద్రపరిచేం దుకు స్ట్రాంగ్ రూంలను ఎంపిక చేశారు. కౌం టింగ్ వరకు పటిష్టమైన భద్రత ఉంటుంది. ఇక డబ్బు, మద్యం, ఇతరత్రా వాటితో ఓ టర్లను ప్రలోభానికి గురిచేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నే తలు వివిధ సూచనలు చేశారు.
సార్వత్రానికీ రెడీ..
అనంతరం పార్లమెంట్, శాసన సభ సాధారణ ఎన్నికల నిర్వహణా ఏర్పాట్లను కూడా కలెక్టర్ సమీక్షించారు. ఏప్రిల్ 2నుంచి 9వరకు చేపట్టే నామినేషన్లకు అంతా సిద్దం చేశామన్నారు. ఈఎన్నికల్లో నామినేషన్లు ముగిసేలోగా ఓటరుగా నమోదు చేసుకొన్న వారందరికి ఓటు హక్కు కల్పిస్తారు. అదే విధంగా, 18-19వయస్సు వారు జిల్లాలో 3లక్షలకు పైగా నమోదు చేసుకొన్నారు. వారికి ఎపిక్ కార్డుల్ని ఇంటింటికెళ్లి అందజేసి, వారి నుంచి రశీదులు తీసుకొంటారు. ఈఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులకు పార్లమెంట్‌కు రూ.70, అసెంబ్లీకి రూ.30లక్షలు మించి ఖర్చు చేయరాదు. ఇక ప్రచారం, బహిరంగ సభలు, ఇతరత్రా వాటన్నింటిని అభ్యర్థి ఖాతాల్లోనే జమచేసి లెక్కిరు. ప్రస్తుతం నిర్వహించే ఎన్నికల్లో 1500 మంది ఓటర్లు దాటితే అదనంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.
ఇందుకు వివరాలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు. ఈ ఎన్నికలకు సంబంధించి 3,248పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. పోలింగ్‌ను వెబ్‌కాస్టింగ్‌లో పర్యవేక్షిస్తారు. ఇబ్బందులు తలెత్తిన తక్షణమే పరిష్కరించేందుకు సరిపడా బృందాలను ఏర్పాటు చేశారు. ఇక నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థులకు జిల్లా, రాష్ట్రం, దేశంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఆస్తులున్నా సమాచారం ఇవ్వాలి. ఏదైనా సమాచారం ఇవ్వకుండా నామినేషన్ వేస్తే వాటిని తిరస్కరిస్తారు.
200మందిని బైండోవర్......
ఎన్నికల దృష్ట్యా వివిధ కేసుల్లో ఉండి రౌడీ షీటర్లుగా గుర్తింపు ఉను 200మందిని బైండోవర్ల కింద అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ వెల్లడించారు. ఇక లెసైన్స్ వెపన్లు కలిగి ఉన్న వారు ఇది వరకే 90శాతం మంది డిపాజిట్ చేశారని, మిగిలిన వారు రెండు రోజుల్లో చేసేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. అంతర్‌రాష్ట్ర రహదారులపై 22, జిల్లాలో అదనంగా 20కిపైగా చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇక నుంచి బహిరంగ సభలు, ర్యాలీలు, వాహనాలకు మైక్ తదితర వాటికి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. మున్సిపల్, సాధారణ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని, గతంలో మాదిరి కాకుండా, ఈసారి పోలీసులపై రెవెన్యూ అధికారి పర్యవేక్షిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జేసి ఎల్.శర్మన్, డీఅర్వొ రాంకిషన్, డిఅర్‌డిఏ పీడీ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అమరయ్యతోపాటు, డిసిసి అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, సీపిఐ జిల్లా కార్యదర్శి కిల్లె గోపాల్‌తోపాటు, ఇతర పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు.
రెడీ.. స్టడీ..!
Published Sat, Mar 8 2014 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
Advertisement
Advertisement