ఏపీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ
విజయవాడ: లోకేష్‌కు దోచిపెట్టేందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్ట్ చేపట్టారని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని రాజశేఖర్(నెహ్రూ) ఆరోపించారు. దమ్ముంటే పట్టిసీమ ప్రాజెక్ట్‌పై అఖిలపక్షంతో బహిరంగ చర్చ నిర్వహించి బాబు తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు చేపడితే ధనయజ్ఞం కోసం అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు తన కుమారుడు లోకేష్ కోసం పట్టిసీమ చేపట్టారా? అని ప్రశ్నించారు.