చాట్రాయి(కృష్ణా): ఇద్దరూ ప్రాణ స్నేహితులు.. అధిక వడ్డీలకు తీసుకున్న అప్పులు వారి పాలిట యమపాశాలయ్యాయి. చివరికి ఇద్దరూ కలిసే చనిపోయారు. కృష్ణా జిల్లా చాట్రాయి మండల కేంద్రంలో జరిగిన ఈఘటనపై మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాలివీ.. చాట్రాయికి చెందిన లోకాల మధు (36), కర్రెడ్ల పుల్లారావు(35) ప్రాణ స్నేహితులు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న మధుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా పనిచేసుకుంటున్న పుల్లారావుకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కుటుంబ అవసరాల రీత్యా అధిక వడ్డీకి కొంత రుణం తీసుకున్నారు. సకాలంలో తీర్చలేకపోవటంతో రుణదాతలు ఒత్తిడి చేశారు.
దీనిపై తీవ్ర మనస్తాపం చెందిన స్నేహితులిద్దరూ సోమవారం రాత్రి ఊరికెళుతున్నామని కుటుంబసభ్యులకు చెప్పి ఇంటి నుంచి వచ్చారు. ఇద్దరూ స్థానిక శివాలయం వద్ద ఉన్న బావిలోదూకి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం బావిలో ఉన్న మృతదేహాలను స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక ఇబ్బందులతో బావిలో పడి చనిపోయి ఉండవచ్చుననే ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేశ్వర్ తెలిపారు.
ప్రాణమిత్రుల్ని కడతేర్చిన అప్పులు
Published Wed, Sep 16 2015 5:03 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement