కృష్ణాజిల్లా: డీజిల్ దొంగలిస్తున్న దొంగను గుర్తించిన స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన జిల్లాలోని నూజివీడు ఎంప్లాయిస్‌కాలనీలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. కారు నుంచి డీజిల్ దొంగలిస్తున్న యువకున్ని స్థానికులు ప్రశ్నించడంతో.. పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో అతన్ని బంధించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు.