విభజన నేపథ్యంలో వచ్చేనెల రెండో తేదీ నుంచి భూములు, స్థలాలు, ఇతర స్థిరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన లావాదేవీలను కూడా రెండు రాష్ట్రాలు వేర్వేరుగా నిర్వహిస్తారుు. తెలంగాణలో జరిగే రిజిస్ట్రేషన్ల ఆదాయం తెలంగాణకు, ఆంధ్రలో జరిగే రిజిస్ట్రేషన్ల ఆదాయం ఆంధప్రదేశ్‌కు చెందుతుంది. తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు ఆ రాష్ట్రం పేరిట ప్రత్యేక స్టాంపులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రస్తుతం ఉన్న స్టాంపులే అమల్లో ఉంటాయి. అయితే కొత్తవి వచ్చే వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పేరిట ఉన్న స్టాంపులనే రెండు రాష్ట్రాల్లోనూ వినియోగిస్తారు.
తెలంగాణలో రిజిస్ట్రేషన్ సమయంలో ఈ స్టాంపులపై తెలంగాణ అనే ప్రత్యేక రబ్బరు స్టాంపు ముద్రిస్తారు. జూన్ ఒకటో తేదీకి ముందు ఉమ్మడి రాష్ట్రంలో కొనుగోలు చేసిన స్టాంపులను ఆ తర్వాత కూడా ఏ రాష్ట్రంలోనైనా వినియోగించుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలంగాణ పేరిట స్టాంపులు ముద్రించి పంపాల్సిందిగా నాసిక్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌కు ప్రభుత్వం తరఫున అధికారిక ఇండెంటు పంపాల్సి ఉంటుంది. అవి వచ్చే వరకు రెండు రాష్ట్రాల్లోనూ పాత స్టాంపులే చెల్లుబాటవుతారుు.
ఇరు రాష్ట్రాలకు వేర్వేరు స్టాంపులు
Published Mon, May 26 2014 3:22 AM | Last Updated on Sat, Jun 2 2018 2:08 PM
Advertisement
Advertisement