వరంగల్ పార్లమెంట్ స్థానానికి వికలాంగ అభ్యర్థి | disabled candidate Warangal LS by-poll | Sakshi
Sakshi News home page

వరంగల్ పార్లమెంట్ స్థానానికి వికలాంగ అభ్యర్థి

Published Thu, Oct 29 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM

వరంగల్ పార్లమెంట్ స్థానానికి వికలాంగ అభ్యర్థి

వరంగల్ పార్లమెంట్ స్థానానికి వికలాంగ అభ్యర్థి

సాంబమూర్తినగర్ (కాకినాడ) : తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పార్లమెంట్ స్థానానికి వికలాంగుల తరఫున అభ్యర్థిని నిలబెడతామని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర రావు తెలిపారు. బుధవారం కాకినాడ వచ్చిన ఆయన జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు వికలాంగుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచారన్నారు. వైకల్యాన్ని బట్టి పింఛన్ ఇవ్వడం అనుచితమన్నారు. వికలాంగులందరికీ ఒకేలా రూ.1500 పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు ఖండవిల్లి భరత్‌కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల రత్నం, జిల్లా ప్రధాన కార్యదర్శి జవ్వాది సూరి బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు కముజు నాగేశ్వరరావు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement