ధర్నాలో ఏపీ వైఎస్సార్‌టీఎఫ్ నాయకులు
అనంతపురం అర్బన్ : తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని ఏపీ వైఎస్సార్‌టీఎఫ్ నాయకులు ఆరోపించారు. 60 శాతం ఫిట్‌మెంట్, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై శనివారం ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పి.అశోక్‌కుమార్‌రెడ్డి 60 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హెల్త్‌కార్డు లోపాలను సవరించి రూ.398 వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయులకు నేషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నారు.
ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ పుల్లారెడ్డి మాట్లాడుతూ కౌన్సెలింగ్ విద్యావిధానానికి విఘతం కల్పించే విధంగా ఇటీవల నిర్వహించిన అక్రమ బదిలీలను అరికట్టాలన్నారు. ఉపాధ్యాయ రేషన్‌లైజ్ విధానాన్ని ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం సవరణలు చేయాలన్నారు. ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించి, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం 15 డిమాండ్లతో వినతి పత్రాన్ని డీఆర్‌ఓ సీహెచ్. హేమసాగర్‌కు అందజేశారు. గౌరవ అధ్యక్షుడు జే వెంకటేష్, నాయకులు ఫల్గుణ ప్రసాద్, గిరిధర్‌రెడ్డి, గోవిందరెడ్డి, శ్రీనివాసులు, సురేష్, అల్తాఫ్, మాధవరెడ్డి, రెడ్డప్పరెడ్డి, మల్లయ్య, రాధాకృష్ణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఉపాధ్యాయలు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల ధర్నాకు ట్రేడ్ యూనియన్, విద్యార్థి విభాగం, ఖజాన శాఖ ఉద్యోగుల సంఘం, బీసీ ఉపాధ్యాయ సంఘం నేతలు సంఘీభావం ప్రకటించారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం
Published Sun, Dec 21 2014 2:39 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
Advertisement
Advertisement