తాగుబోతుల వీరంగం | drunkers attacked on a man | Sakshi
Sakshi News home page

తాగుబోతుల వీరంగం

Published Tue, Aug 22 2017 9:03 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

తాగుబోతుల వీరంగం - Sakshi

తాగుబోతుల వీరంగం

మైలవరం(కృష్ణా): మైలవరంలో తాగు బోతుల వీరంగంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సోమవారం రాత్రి ఓ వ్యక్తిపై తాగుబోతులు దాడిచేశారు. రామకృష్ణ అనే వ్యక్తిని మద్యం మత్తులో తాగుబోతులు గాయపరిచారు. పని ముగించుకుని ఇంటికి వస్తుండగా మార్గంమధ్యలో బెజవాడ వైన్స్‌ వద్ద అతనిపై దాడిచేశారు.

తీవ్రంగా గాయపడిన అతడిని మైలవరం ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డుపై చెత్త వేయడాన్ని ప్రశ్నించినందుకే రామకృష్ణపై తాగుబోతులు దాడిచేశారని చెబుతున్నారు. కాగా, తాగుబోతులు పరారీలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement