గన్నవరం: మద్యం సేవించిన మైకంలో రాంగ్‌రూట్‌లో బైక్ నడపడంతో పాటు ఎదురుగా అడ్డువచ్చారని అన్నచెల్లిలపై కొంత మంది యువకులు అమానుషంగా దాడిచేసి కొట్టిన సంఘటన స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పెద్దపాడు మండలం ఈపూరు గ్రామానికి చెందిన విద్యార్థిని గన్నవరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె సోదరుడైన కాటూరి సుధీర్ బుధవారం దావాజిగూడెంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో చెల్లెలను కళాశాల నుండి బైక్‌పై ఎక్కించుకుని గ్రామానికి బయలుదేరాడు. అంజనేయస్వామి గుడి దాటిన తర్వాత రాంగ్‌రూట్‌లో వేగంగా వచ్చిన ఓ యువకుడు వీరి బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌తో సహా అన్నచెల్లెలు కిందపడిపోయారు. ఇదేమని ప్రశ్నించిన సుధీర్‌పై సదరు యువకుడు దాటిచేసి కొట్టడంతో పాటు ఫోన్‌చేసి ఆతని స్నేహితులను కూడా పిలిపిం చాడు. అక్కడికి వచ్చిన యూసుప్‌తో పాటు మరో ఇరువురు యువకులు సుధీర్‌పై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. యూసుప్ బీరుసీసా పగులకొట్టి సుధీర్‌పై దాడికి ప్రయత్నించగా ఆతను తృటిలో తప్పించుకోవడంతో మెడపైన గాయంతో బయటపడ్డారు.
ఇంతలో చుట్టూ పక్కల వాళ్లు అక్కడికి చేరుకోవడంతో పాటు పోలీసులు రావడంతో సదరు యువకులు పరారయ్యారు. దీంతో బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన యువకులు పూటుగా మద్యం సేవించి ఉన్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఇటీవల శ్రీనగర్‌కాలనీలో క్రికెట్ బ్యాట్‌లతో యువకులు పరస్పరం దాడి చేసుకున్న సంఘటనలో కూడా ప్రస్తుతం అన్నచెల్లిలపై దాడిచేసిన ఘటనలో కూడా ఈ యువకులు ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. వీరిపై గతంలో కేసులు నమోదు చేయడంతో పాటు సస్పెక్ట్‌షిట్ కూడా ఓపెన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment