సారా విక్రయాలు వద్దన్నందుకు గ్రామ వాలంటీర్‌పై దాడి | Alcohol Sellers Attack Grama Volunteer In Krishna District | Sakshi
Sakshi News home page

సారా విక్రయాలు వద్దన్నందుకు గ్రామ వాలంటీర్‌పై దాడి

Published Mon, Jun 28 2021 10:43 AM | Last Updated on Mon, Jun 28 2021 11:13 AM

Alcohol Sellers Attack Grama Volunteer In Krishna District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కృష్ణా: జిల్లాలోని నూజివీడు మండలం హనుమంతులగూడెం గ్రామంలో సారా విక్రయదారులు రెచ్చిపోయారు. గ్రామంలో సారా విక్రయాలు ఆపేయాలని చెప్పినందుకు ఏకంగా గ్రామ వాలంటీర్‌పైనే దాడికి దిగారు. వివరాల్లోకి వెళ్తే... సారా విక్రయదారులు హనుమంతులగూడెం గ్రామంలో సారా అమ్మకాలను సాగిస్తున్నారు. సారా అమ్మకాలను గమనించిన గ్రామ వాలంటీర్ ధీరపాల విజయ గ్రామంలో సారా విక్రయాలు నిలిపివేయాలని చెప్పారు.

దీంతో సారా విక్రయదారులంతా ఏకమై గ్రామంలో విధులు నిర్వహిస్తున్న వాలంటీర్ విజయపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఆమెకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. తనపై దాడికి పాల్పడిన ఏడుగురు సారా అమ్మకందారులపై వాలంటీర్ విజయ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
చదవండి: గోదావరిలో నలుగురు విద్యార్ధుల గల్లంతు.. 3 మృతదేహాలు లభ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement