
శ్రీవారి భక్తుల లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే
- మొత్తం నగదు రహిత లావాదేవీలు జరపాలని నిర్ణయం
- బస, దర్శనం, ఈ-హుండీ, ఈ-డొనేషన్.. మరింత ప్రచారం చేయాలని సంకల్పం
సాక్షి,తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇప్పటికే ఈ-ఫ్లాట్ ఫాం కింద నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తోంది. కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో అదే విధానాలు మరింత విస్తరించి, భక్తులకు చేరువ కావాలని భావిస్తోంది. తిరుమలలో 7 వేల గదులు ఉన్నాయి. ప్రస్తుతం 15 నుండి 20% గదులు ఆన్‌లైన్‌లో అడ్వాన్‌స రిజర్వేషన్ ద్వారా కేటారుుస్తున్నారు. ఈ అడ్వాన్‌స బుకింగ్ విధానాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించారు.
రూ.50, రూ.300 టికెట్ల కోటాపెంపు యోచన
2010లో ప్రారంభించిన రూ. 300 శీఘ్రదర్శన టికెట్లను 2013 నుండి పూర్తి స్థారుులో ఆన్‌లైన్ పద్ధ్దతి ద్వారా కేటాయిస్తున్నారు. రూ. 50 చెల్లించి రెండు లడ్డూలు కూడా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయొచ్చు. ఇదే తరహాలోనే రూ. 50 సుదర్శనం టికెట్లు కూడా కేటాయిస్తున్నారు. ఆన్‌లైన్ విధానంలోనే రూ. 300, రూ. 50 సుదర్శనం టికెట్ల సంఖ్యను మరింత పెంచాలని భావిస్తున్నారు.
ఈ-హుండీకి విసృ్తత ప్రచారం
తిరుమలకు రాలేనివారు, ఇతర ప్రాంతాల నుండే శ్రీవారికి కానుకలు సమర్పించాలనుకునే భక్తుల కోసం ఇప్పటికే టీటీడీ ఈ-హుండీ ప్రారంభించింది. దీని ద్వారా భక్తులు నెలకు రూ. కోటి పైబడి విరాళాలు సమర్పిస్తున్నారు. తాజాగా ఈ-హుండీకి మరింత ప్రచారం కల్పించాలని టీటీడీ సంకల్పించింది.
ఈ-డొనేషన్ ద్వారా ట్రస్టులకు విరాళాలు
టీటీడీ పరిధిలో మొత్తం 9 ట్రస్టులు, ఒక స్కీము ఉన్నారుు. ఏటా రూ.80 కోట్ల దాకా విరాళాలు అందుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు 12నుంచి భక్తులకు ’ఈ-పాస్‌బుక్’ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. విరాళం డీడీ లేదా చెక్ ద్వారా నగదు బదిలీ అయిన 48 గంటల్లోపే విరాళం ఇచ్చిన దాతకు ఈ-పాస్‌బుక్ ఇస్తున్నారు. అదే రోజు నుండే ఈ-డొనేషన్ విధానంలోనూ రూ.లక్ష అంతకంటే ఎక్కువ ఇచ్చిన దాతలకు కేవలం 24 గంటల్లోపే ఈ-పాస్‌బుక్ చేతికి అందేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. డీమ్యాట్ ఖాతాతో శ్రీవారికి షేర్లు, బాండ్లు బదలాయింపునకు మరింత ప్రచారం ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.
ఆన్‌లైన్ ద్వారా పారదర్శకత
దేశ విదేశాల నుండి వచ్చే భక్తులకు తిరుమలలో బస, దర్శనం, ఈ హుండీ, ఈ-డొనేషన్,....వంటి వాటితో ఆన్‌లైన్ కేటారుుంపులు అమలు చేస్తున్నాం. ఈ-కేటాయింపులతో నగదు వ్యవహారాల్లో పారద ర్శకత పెరిగింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్‌తో పాటు పీవోఎస్ యంత్రాల ద్వారా నగదు వ్యవహా రాలు పెంచుతాం. డెబిట్, క్రెడిట్, ఆన్‌లైన్ ద్వారా భక్తులు టీటీడీ సదుపాయాలు పొందేట్లు చేస్తాం.
- డాక్టర్ దొండపాటి సాంబశివరావు, ఈవో, టీటీడీ