
ప్రొఫెసర్ వీఎస్ఎస్ కుమార్
కాకినాడ: మే 8న ఏపీతోపాటు తెలంగాణలో కూడా ఎంసెట్ నిర్వహిస్తున్నట్లు కాకినాడ జేఎన్టీయు వైస్ ఛాన్సలర్, ఎంసెట్ చైర్మన్ డాక్టర్ వీఎస్ఎస్ కుమార్ చెప్పారు. హైదరాబాద్లో 67 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఇప్పటివరకు రెండు లక్షల 54 వేల 523 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఇంజనీరింగ్కు 355 పరీక్షా కేంద్రాలు, మెడికల్కు 193 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కుమార్ వివరించారు.