తూర్పు గోదావరి పార్లమెంట్‌ విజేతలు వీరే.. | East Godavari Distrct Parliament Winners | Sakshi
Sakshi News home page

తూర్పు గోదావరి పార్లమెంట్‌ విజేతలు వీరే..

Published Fri, May 24 2019 3:23 PM | Last Updated on Fri, May 24 2019 3:26 PM

East Godavari Distrct Parliament Winners - Sakshi

రాజమండ్రి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఆయన ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గరగా చూశారు. ఆ సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. జగన్‌ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం జరుగుతుంది. నాలాంటి యువకులనెందరినో జగన్‌ ప్రోత్సహించారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవకాశం ఇచ్చారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తాను. ప్రస్తుతం రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం వీడింది. 
– మార్గాని భరత్‌ రామ్, వైఎస్సార్‌ సీపీ రాజమహేంద్రవరం ఎంపీ

కాకినాడ
నాయకత్వ పటిమ–జనాదరణ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాయి. నిత్యం ప్రజలతో మమేకమై కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానని భరోసానిచ్చిన జగన్‌ వంటి నేతకు ప్రజలు బ్రహ్మరథం పడతారనడానికి ప్రస్తుత ఎన్నికల ఫలితాలే నిదర్శనం. తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి బాటలో పేదవర్గాల ప్రజల కోసం శ్రమిస్తారన్న నమ్మకం ప్రజల్లో బలపడింది. అందువల్లే ప్రజలు ఏకపక్షంగా తీర్పునిచ్చారు. నవరత్న పథకాలు, ఇతర హామీలు కూడా ప్రభావాన్ని చూపించాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. 
– వంగా గీతావిశ్వనాథ్, వైఎస్సార్‌ సీపీ కాకినాడ ఎంపీ

అమలాపురం
నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతతో ఉంటాను. తనపై నమ్మకం ఉంచి పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసిన పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తాను. ముఖ్యమంత్రి కానున్న జగన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం సంక్షేమ పథకాల అమలుతోపాటు, అన్నిరంగాల్లోను అభివృద్ధి సాధించగలదన్న ఆకాంక్షిస్తున్నాను. నా విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకూ రుణపడి ఉంటాను. నియోజకవర్గంలో నేను పరిశీలించిన స్థానిక సమస్యలన్నింటిని పరిష్కరించి నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తాను. 
– చింతా అనూరాధ, వైఎస్సార్‌ సీపీ అమలాపురం ఎంపీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement