
తపాలా సేవలు విస్తృతం
సాక్షి, విజయవాడ బ్యూరో: పోస్టాఫీసుల ద్వారా అందించే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కె.సుధాకరరావు చెప్పారు. శుక్రవారం విజయవాడ రీజియన్ పరిధిలోని ఆరు జిల్లాల పోస్టల్ ఉద్యోగులతో సమావేశం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. లబ్ధిదారులంతా ఒకే రోజు పోస్టాఫీసులకు రాకుండా సీరియల్ నంబర్ల వారీగా విభజించి ఒక్కో పోస్టాఫీసులో 750 మందికి ఒక బయోమెట్రిక్ మిషన్ అందుబాటులో ఉంచుతామన్నారు. ఇంకా ఆయన చెప్పినవి ఇలా...
ళీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 95 హెడ్‌పోస్టాఫీసుల్లోనూ రోజుకు 5 వేల టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్ల విక్రయాలు. ఈ నెల 5 నుంచి దీన్ని ప్రారంభం. ళీ వరల్డ్ నెట్‌వర్క్ ఎక్స్‌ప్రెస్ పోస్టు కింద 188 దేశాలకు పార్సిళ్లు పంపుకునే అవకాశం . ళీ ఆశీర్వచనం సేవల పరిధిలోకి శ్రీకూర్మం, అరసవిల్లి ఆలయాల ప్రసాదం పంపిణీ. ళీ ఏపీ, తెలంగాణల్లో ‘నగదు రహిత సేవలు’ ఇందుకు 63 పోస్టాఫీసులను తొలి దశలో ఎంపిక .