ప్రజా సంక్షేమం మరచిన బాబు | electricity chargesraising brutally :- MLA PRK | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమం మరచిన బాబు

Published Mon, Apr 11 2016 1:10 AM | Last Updated on Tue, Oct 30 2018 4:51 PM

ప్రజా సంక్షేమం మరచిన బాబు - Sakshi

ప్రజా సంక్షేమం మరచిన బాబు

విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం
ఎమ్మెల్యే పీఆర్కే

 
మాచర్ల (దుర్గి) : నీతిమాలిన రాజకీయాలతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమాన్ని మరిచారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ధర్మవరంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొనేందుకు వచ్చేశారు. స్థానిక నాయకులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఎంతో బాధ కలిగిస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు పాలన ప్రజలకు శనిగా దాపురించిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు డబ్బు ఎర చూపి తనవైపునకు లాక్కోవటం ఎంత దిగజారిన రాజకీయమో అర్థం చేసుకోవచ్చన్నారు. కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు.

విద్యుత్ చార్జీలను పెంచటం దారుణమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమ పాలనను ప్రజలు ఎన్నటికీ మరువలేరని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించే శక్తి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్ర మే ఉందని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఉన్నం వెంకటేశ్వర్లు, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు లింగా మల్లయ్య, వెలిదండి ఉమాగోపాల్, నేతలు బాలశ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు,  వెంకటరెడ్డి, అంబారావు, అంజి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement