నెల్లూరులో గురువారం కురిసిన వర్షం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గురువారం ఊహించని విధంగా పడిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా 120 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. ఈ పరిణామంపై విద్యుత్ ఉన్నతాధికారులు శుక్రవారం క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించారు.
► రాష్ట్రవ్యాప్తంగా గురువారం వీచిన గాలులు, వర్షానికి పలు జిల్లాల్లో భారీగా విద్యుత్ అంతరాయాలు చోటు చేసుకున్నాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
► వర్షం కారణంగా రైతులు కూడా వ్యవసాయ విద్యుత్ ఉపయోగించుకోలేదు.
► ఏప్రిల్‌లో సాధారణంగా 210 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుందని ఈ ఏడాది అంచనా వేశారు. లాక్‌డౌన్ కారణంగా వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ తగ్గిపోయి రోజుకు 150 మిలియన్ యూనిట్లు నమోదవుతోంది. గాలి దుమ్ము వల్ల ఇది 120 మిలియన్ యూనిట్లకు చేరింది.
► ఇలా విద్యుత్ డిమాండ్ పడిపోవడం, తిరిగి కొన్ని గంటల్లో పుంజుకోవడం వల్ల గ్రిడ్ మేనేజ్‌మెంట్‌కు సమస్యగా మారుతోందని లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ) ఇంజినీర్లు చెబుతున్నారు.
► లాక్‌డౌన్ ముగిసే వరకూ కచ్చితమైన ప్రణాళికలన్నవి కష్టంగానే ఉన్నాయని.. పరిస్థితిని బట్టి ముందుకెళ్లడం మినహా చేయగలిగిందేమీ లేదని ఓ అధికారి చెప్పారు.
ఇది చదవండి: గత నెల ఎంత వస్తే అంతే కట్టండి!
Comments
Please login to add a commentAdd a comment