‘ఉపాధి’కి నిధుల కొరత లేదు
Published Sun, Jan 5 2014 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
సీతానగరం: జిల్లాలోని వేతనదారులకు బిల్లుల చెల్లింపునకు నిధుల కొరత లేదని డ్వామా పీడీ ఎంవీ గోవిందరాజులు అన్నారు. శనివా రం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా రూ.577 కోట్లతో 31 వేల పను లు చేపట్టాలని ప్రణాళికలు రూ పొందించామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వర కూ 23 వేల కుటుంబాలకు వంద రోజుల పని కల్పించామన్నారు. ఇందుకు రూ.300 కోట్ల నిధులు ఖ ర్చు చేసినట్టు చెప్పారు. ఇందిరమ్మ పచ్చతోరణం పథ కం ద్వారా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 1.23 లక్షల జీడి, మామి డి మొక్కలను పంపిణీ చేశామని తెలిపారు.
‘విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు’
బొబ్బిలి రూరల్ : విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని ఉపాధి హామీ పథకం పీడీ గోవిందరాజులు హెచ్చరించారు. శనివారం ఆయన మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఎప్పటికప్పుడు పనులను పరిశీలిస్తామని, సిబ్బంది పనితీరు బాగాలేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. నారాయణప్పవలస, కమ్మవలస, కొండదేవుపల్లి, కారాడ గ్రామాల్లో వేతనదారులకు వంద రోజుల పని దినాలు కల్పించకపోవడంతో ఆయూ క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహా యకులను నిలదీశారు. సీతయ్యపేట, కలువరాయి గ్రామాల్లో గిట్టుబాటు వేతనం తక్కువగా రావడంపై సిబ్బందిని ప్రశ్నించారు. ఏపీడీ అప్పలనాయుడు మా ట్లాడుతూ ఉపాధి పనులు వేగవంతం చేయాలన్నారు. ఏయే గ్రామాల్లో వేతనాల చెల్లింపునకు ఇబ్బందులు ఉన్నాయో సిబ్బం దిని అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ అరుంధతీదేవి, ఏపీఓ కేశవరావు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement