భువనగిరి, న్యూస్‌లైన్
కీలుఎరిగి వాతపెట్టిన చందంగా పండగల సమయంలో ఆర్టీసీ ప్రయాణికులను దారిపొడవునా దోచుకుంటోంది. ప్రయాణికులను తరలించే క్రమంలో పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు పెట్టి బహిరంగంగా దోపిడీకి పాల్పడుతున్నారు. పండగ సెలవులు ముగియడంతో విద్యార్థులు, ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల ప్రజలు ఇంటిదారి పట్టారు. ఈ క్రమంలో రద్దీ పెరిగింది. రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నామంటూ దొడ్డిదారిన ఆర్డినరీ బస్సులలో ప్రయాణించే వారి నుంచి ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. గురువారం హైదరాబాద్-వరంగల్ మార్గంలో ఏర్పాటు చేసిన అదనపు బస్సులలో ప్రయాణికుల నుంచి ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేశారు.
ఆకుపచ్చరంగు గల ఆర్డినరీ(పల్లెవెలుగు) బస్ ఎక్కిన తర్వాత కండక్టర్ ఎక్స్‌ప్రెస్ టికెట్ ఇస్తుండడంతో ప్రయాణికులు చేసేది లేక గమ్యం చేరాలనే తాపత్రయంతో అధిక రేట్లు చెల్లించి టికెట్ తీసుకుంటున్నారు. ఇదే అదునుగా ఆర్టీసీ అధికారులు కాలం చెల్లిన, సరైన సీట్లులేని డొక్కు బస్సులను అదనపు సర్వీసుల పేరుతో తిప్పుతున్నారు. దీంతో సరైన సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులకు ఈ అవస్థలు ఎదురవుతున్నాయి.
ఆర్డినరీ బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు
Published Fri, Oct 18 2013 2:45 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement