express buses
-
ఎక్కడంటే అక్కడ ఆపాలంటూ!
రాయచూర్ వెళ్లే నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సు ఇమ్లీబన్‌లో బయలుదేరింది.. బస్సు కిక్కిరిసిపోయి ఉంది.. బహదూర్‌పుర రాగానే తాము దిగుతామని, బస్సు ఆపాలంటూ ముగ్గురు మహిళలు డ్రైవర్ వద్దకు వచ్చి నిలబడ్డారు. అలా మరికొంత దూరం వెళ్లాక, మరో ఇద్దరు మహిళలు బస్సు ఆపాలంటూ అడిగారు. వాస్తవానికి ఆ బస్సు ఎక్కడా ఆగకుండా రాయచూరుకు వెళ్లాల్సి ఉండగా, ఇలా మహిళల వాదనలు, డిమాండ్లతో పదిహేను చోట్ల ఆపాల్సి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చాక, ఆర్టీసీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. తాము ఎక్కడ ఆపమంటే బస్సును అక్కడ ఆపాలంటూ ఒత్తిడి చేసు్తన్నారు. ఆ బస్సులకు స్టాప్ లేని చోట్ల, సాధారణ పాయింట్ల వద్ద ఆపాలంటూ డ్రైవర్, కండక్టర్‌తో వాగ్వాదానికి దిగుతున్నారు. ఫలితంగా ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆర్డినరీ బస్సుల్లాగా చాలా చోట్ల ఆగుతూ వెళ్లాల్సి వస్తోంది. ఈ పథకం ప్రారంభమైన కొత్తలో, ఓ మహిళ నుంచి టికెట్ రుసుము వసూలు చేశారంటూ ఆ మహిళ తాలూకు వ్యక్తి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. సదరు మహిళ తరపున పురుష వ్యక్తి టికెట్ తీసుకోవటంతో, మహిళ కూడా ఉందన్న విషయం తెలియక కండక్టర్ జీరో టికెట్‌కు బదులు సాధారణ టికెట్ ఇచ్చాడు. ఫిర్యాదు నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించి ఆ కండక్టర్‌పై చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఇప్పుడు కొందరు మహిళలు తాము కోరిన చోట బస్సు ఆపకుంటే ఫిర్యాదు చేస్తామని డ్రైవర్, కండక్టర్లను బెదిరిస్తున్నారు. దీంతో బస్సులను వారు ఆపుతున్నారు. మరోవైపు ఇతర ప్రయాణికుల అభ్యంతరం ఎక్కడపడితే అక్కడ బస్సులను ఆపేస్తుండటంతో ఇతర ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురై కండక్టర్లు, డ్రైవర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇలా రెండు వైపుల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో భరించలేక సిబ్బంది శుక్రవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆయన నిర్వహించిన గూగుల్‌మీట్‌లో ఈమేరకు మొర పెట్టుకున్నారు. దీనికి సజ్జనార్ స్పందించారు. ఎవరు ఒత్తిడి చేసినా ఆపొద్దు: సజ్జనార్ ఇకపై ఎక్స్‌ప్రెస్ బస్సులను నిర్ధారిత స్టాపుల్లో మాత్రమే ఆపాల ని, తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సుల్లోనే వెళ్లాలని సజ్జనార్ సూచించారు. స్టాపు లేనిచోట ఎవరు ఒత్తిడి చేసినా ఆపొద్దని స్పష్టం చేశారు. -
TSRTC: పల్లె వెలుగులు ఎక్కువగా వాడుకోండి: సజ్జనార్
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద.. మహిళలకు అందుబాటులోకి తెచ్చిన ఉచిత ప్రయాణ సదుపాయం పలు ఇబ్బందులకు కారణం అవుతోంది. సోషల్ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తున్నాం. మరోవైపు ఫ్రీ జర్నీ కల్పిస్తూనే.. బస్సుల సంఖ్యను తగ్గించదనే విమర్శ టీఎస్ ఆర్టీసీ ఎదుర్కొంటోంది. అయితే అలాంటిదేం లేదని.. బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు ఆర్టీసీ చెబుతోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో ఒక ప్రకటన చేశారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని.. అయితే అది మరోలా ఉంటోందని చెబుతున్నారాయన. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అన్నారాయన. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరుతూ ఓ వీడియోను ఉంచారు. మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతోందని అన్నారయన. ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని, దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. -
ఆర్టీసీకి 910 కొత్త బస్సులు
సాక్షి, హైదరాబాద్: మూడునెలల్లో ఆర్టీసీకి 910 కొత్త బస్సులు సమకూరబోతున్నాయి. చాలా కాలంగా పాతబడ్డ బస్సులతో లాక్కొస్తుండగా, వాటిల్లోంచి కొన్నింటిని తుక్కుగా మార్చేసి.. కొత్త బస్సులు అందుబాటులోకి తేవాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే టెండర్లు పిలవగా టాటా, అశోక్ లేలాండ్ కంపెనీలు తక్కువ కొటే షన్తో ముందుకొచ్చాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నెగోషియేషన్స్ ద్వారా వాటి కొటేషన్ మొత్తాన్ని కొంతమేర తగ్గించేందుకు ఆర్టీసీ అధి కారులు చర్చలు జరుపుతున్నారు. మరికొద్ది రో జుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి, రెండు కంపెనీలు ఒకే ధరకు ముందుకొచ్చేలా చేసి, వాటికే ఆర్డర్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ నెలలోనే కంపెనీ లకు బస్సులు ఆర్డర్ ఇస్తే...బస్ బాడీల నిర్మా ణానికి మూడు నెలల సమయం పడుతుంది. ఎక్స్‌ప్రెస్ బస్సులు 540 ఆర్టీసీలో బాగా డిమాండ్ ఉన్న ఎక్స్‌ప్రెస్ కేటగిరీని బలోపేతం చేయాలని సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం అద్దె బస్సులుపోను సొంతంగా 1,800 వరకు ఎక్స్‌ప్రెస్ బస్సులున్నాయి. ఇవి ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తూ ఆర్టీసీకి మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. దూర ప్రాంత పట్టణాల మధ్య ఇవి తిరుగుతున్నాయి. కొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో 540 కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సులు సమకూర్చుకోవాలని ఆర్టీసీ అనుకుంటోంది. వాటి రాకతో డొక్కు ఎక్స్‌ప్రెస్ బస్సులు అదే సంఖ్యలో తొలగిస్తారు. వాటిల్లో కొన్నింటిని సిటీ బస్సులుగా, మరికొన్నింటిని పల్లెవెలుగు బస్సులుగా కన్వర్ట్ చేస్తారు. అంతమేర సిటీ, పల్లెవెలుగు పాత డొక్కు బస్సులను తుక్కుగా మారుస్తారు. స్లీపర్ కమ్ సీటర్ రాజధాని బస్సులు 50 లేదా 60 ఇక దూరప్రాంత పట్టణాల మధ్య తిరుగుతున్న రాజధాని (ఏసీ) బస్సులకు కూడా మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఉన్న బస్సులు బాగా పాతబడిపోయాయి. వాటిల్లోంచి మరీ పాత బస్సులను తొలగించి కొన్ని కొత్తవి సమకూ ర్చాలన్న ఉద్దేశంతో 50 లేదా 60 బస్సులు కొంటున్నారు. ప్రస్తుతం రాజధాని కేటగిరీ బస్సు లన్నీ సీటర్ బస్సులే. తొలిసారి ఆ కేటగిరీలో స్లీపర్ బస్సులు సమకూర్చనున్నారు. పైన కొన్ని బెర్తులు, దిగువ సీట్లు ఉండే స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తీసుకోవాలని నిర్ణయించారు. ఎట్టకేలకు పల్లెవెలుగుకు కొత్త బస్సులు సాధారణంగా ఎక్స్‌ప్రెస్, రాజధాని బస్సులు పాతబడ్డాక వాటిని తొలగించి సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులుగా కన్వర్ట్ చేస్తారు. దీంతో ఆ బస్సులు చాలా పాతబడి ఉంటున్నాయి. అయితే కొత్తగా ఇప్పుడు 100 నుంచి 120 మధ్యలో కొత్త బస్సులు సమకూర్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం చాలా ఊళ్లకు అద్దె బస్సులే నడుస్తున్నాయి. మరో 200 కొత్త బస్సులు హైదరాబాద్ సిటీకి కేటాయిస్తారు. -
APSRTC: పల్లె వెలుగు బస్సుల్లో న్యూమాటిక్ డోర్లు.. ఎలా పనిచేస్తాయంటే..
సాక్షి, అమరావతి: ప్రయాణికుల భద్రత కోసం ఏపీఆర్టీసీ మరిన్ని మెరుగైన చర్యలు తీసుకుంటున్నది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ‘న్యూమాటిక్ డోర్లు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా రెండు బస్సుల్లో ఏర్పాటు చేసిన న్యూమాటిక్ డోర్లను ఆర్టీసీ ఎండీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు మంగళవారం పరిశీలించారు. ప్రయాణికులు తొందరపాటుతో కదులుతున్న బస్సుల్లోంచి దిగుతున్నప్పుడుగానీ ఎక్కుతున్నప్పుడుగానీ కాలుజారి పడడం వంటి ప్రమాదాలను నివారించేందుకు న్యూమాటిక్ డోర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ డోర్లు పూర్తిగా డ్రైవర్ నియంత్రణలో ఉంటాయి. బస్సు ఆగిన తరువాత డ్రైవర్ సీటు వద్ద ఉన్న బటన్‌ను నొక్కితేనే డోర్లు తెరుచుకుంటాయి. వర్షాలు, చలితో బస్సులోని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ డోర్లు ఉపయోగపడతాయి. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు డ్రైవర్లతో మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కాగా, త్వరలోనే అన్ని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ న్యూమాటిక్ డోర్లను ఆర్టీసీ ఏర్పాటు చేయనుంది. (క్లిక్ చేయండి: ఇదీ.. అమరావతి రాజధాని అసలు కథ) -
ఆర్డినరీ బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు
భువనగిరి, న్యూస్‌లైన్ కీలుఎరిగి వాతపెట్టిన చందంగా పండగల సమయంలో ఆర్టీసీ ప్రయాణికులను దారిపొడవునా దోచుకుంటోంది. ప్రయాణికులను తరలించే క్రమంలో పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు పెట్టి బహిరంగంగా దోపిడీకి పాల్పడుతున్నారు. పండగ సెలవులు ముగియడంతో విద్యార్థులు, ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల ప్రజలు ఇంటిదారి పట్టారు. ఈ క్రమంలో రద్దీ పెరిగింది. రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నామంటూ దొడ్డిదారిన ఆర్డినరీ బస్సులలో ప్రయాణించే వారి నుంచి ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. గురువారం హైదరాబాద్-వరంగల్ మార్గంలో ఏర్పాటు చేసిన అదనపు బస్సులలో ప్రయాణికుల నుంచి ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేశారు. ఆకుపచ్చరంగు గల ఆర్డినరీ(పల్లెవెలుగు) బస్ ఎక్కిన తర్వాత కండక్టర్ ఎక్స్‌ప్రెస్ టికెట్ ఇస్తుండడంతో ప్రయాణికులు చేసేది లేక గమ్యం చేరాలనే తాపత్రయంతో అధిక రేట్లు చెల్లించి టికెట్ తీసుకుంటున్నారు. ఇదే అదునుగా ఆర్టీసీ అధికారులు కాలం చెల్లిన, సరైన సీట్లులేని డొక్కు బస్సులను అదనపు సర్వీసుల పేరుతో తిప్పుతున్నారు. దీంతో సరైన సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులకు ఈ అవస్థలు ఎదురవుతున్నాయి.