కుటుంబ కలహంతో తల్లీబిడ్డల ఆత్మహత్యా యత్నం
Published Wed, Aug 14 2013 4:29 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
ఏలేశ్వరం, న్యూస్‌లైన్ : కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లీబిడ్డలు పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి చనిపోగా, ఇద్దరు కుమారులు చికిత్స పొందుతున్నారు. పోలీసు లు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని జె.అన్నవరంలో నివసిస్తున్న నిట్టాల వెంకటేశ్వరరావు కిరాణా సామాన్లలు మోటార్ సైకిల్‌పై ఊరూరా తిరుగుతూ విక్రయిస్తుంటాడు. కొంతకాలం నుంచి భార్య పద్మ(36)తో గొడవలు జరుగుతున్నాయి.
వీరి పెద్ద కుమారుడు సందీప్(18) ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండో ఏడాది, చిన్న కుమారుడు సాయిప్రసన్న(16) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి ఏడాది చదువుతున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో వెంకటేశ్వరరావుతో గొడవపడ్డ పద్మ ఇటీవల పుట్టింటికి వెళ్లి, గత శనివారం ఇంటికి తిరిగొచ్చింది. సోమవారం మళ్లీ భార్యాభర్తలకు గొడవ జరిగింది. ఈ క్ర మంలో సందీప్ ఏలేశ్వరంలో పురుగు మందు కొని ఇంటికి తెచ్చాడు. ఉద యాన్నే తల్లి, ఇద్దరు కుమారులు పురుగు మందు తాగారు.
వారు వాంతులు చేసుకోవడాన్ని గమనించిన వెంకటేశ్వరరావు ఓ ప్రైవేట్ వాహనంపై ఏలేశ్వరం ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ పద్మ మరణించగా, ఇద్దరు కుమారులు చికి త్స పొందుతున్నారు. తల్లి పద్మకు తండ్రి లేనిపోని అక్రమ సంబంధం అంటగ డుతున్నట్టు సందీప్, సాయిప్రసన్నలు పేర్కొన్నారు. దీంతో పాటు చుట్టుపక్కల వారితో వచ్చి తమపై తగదాకు దిగాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ రామ్మోహన్ రెడ్డి, ఎస్సై గౌరీశంకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వెంకటేశ్వరరావుతో పాటు ఇరుగుపొరుగున ఉన్న ఎనిమిది మందిపై ఎస్సై గౌరీశంకర్ కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement