సమస్యలపై సమరం | fight on problams | Sakshi
Sakshi News home page

సమస్యలపై సమరం

Published Thu, Jan 30 2014 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

fight on problams

శ్రీరాంపూర్(ఆదిలాబాద్), న్యూస్‌లైన్ :  గని ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు విశాఖ ఉక్కు పరిశ్రమలో మాదిరిగా 25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య డిమాండ్ చేశా రు. కార్మికుల సమస్యలపై సింగరేణి వ్యాప్తంగా గనులు, డిపార్ట్‌మెంట్ల వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యం లో బుధవారం మొదటి షిఫ్టులో కార్మికులు ఆందోళ న కార్యక్రమాలు నిర్వహించి సంబంధిత అధికారులకు డిమాండ్ నోటీసులను అందజేశారు.

 శ్రీరాం పూర్ ఏరియాలోని ఆర్కే-6 గనిపై జరిగిన కార్యక్రమంలో సీతారామయ్య మాట్లాడుతూ గ్రాట్యుటీపై ప్రస్తుతం ఉన్న సీలింగ్ ఎత్తివేయాలని, ఐటీ పరిధి 6 లక్షలకు, పెన్షన్ 40 శాతానికి పెంచాలని, బదిలీ ఫిల్లర్లను పర్మనెంట్ చేయాలని, డిపెండెంట్ ఉద్యోగాలు నెలకు 100 మందికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోల్‌ట్రాన్స్‌పోర్టు, ఓసీపీ ఓబీ పనుల్లో జరుగుతున్న అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు.

అనంతరం మేనేజర్ సత్యనారాయణకు డిమాండ్ నోటీసు అందించారు. ఏరియాలో జరిగిన కార్యక్రమాల్లో యూనియన్ డెప్యూటీ ప్రధాన కార్యదర్శి కె.వీరబధ్రయ్య, కార్యదర్శి భానుదాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మంద మల్లారెడ్డి, రాజేశ్వర్‌రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్, బ్రాంచ్ కార్యదర్శి ఎల్.శ్రీనివాస్, కొట్టె కిషన్‌రావు, బాజీ సైదా, కాంపెల్లి నర్సయ్య, భీంరాజు, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement