దేశంలో లుకలుకలు! | Fighting for example, were the dominant | Sakshi
Sakshi News home page

దేశంలో లుకలుకలు!

Published Fri, Mar 7 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM

దేశంలో లుకలుకలు!

దేశంలో లుకలుకలు!

  •     పార్టీలో చేరే కాంగ్రెస్ నేతలపై మండిపడుతున్న తమ్ముళ్లు
  •      ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయం
  •      అధినేత చంద్రబాబు ఎదుట పంచాయతీకి సిద్ధం
  •  ఆధిపత్య పోరు తెలుగుదేశం పార్టీని కుదిపేస్తోంది. కొత్తగా పార్టీలో చేరే కాంగ్రెస్ నాయకుల వల్ల అసమ్మతి పెరిగిపోతోంది. తమకు ప్రాధాన్యం తగ్గిపోతోందంటూ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చేవారి దూకుడుకు అడ్డుకట్ట వేయకపోతే పార్టీని వీడతామంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు.
     
    సాక్షి, విశాఖపట్నం: గ్రూపు రాజకీయాలు, అసమ్మతి సెగలతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ రగిలిపోతోంది. కొత్తగా పార్టీలో చేరి అధికారం చెలాయించాలన్న నాయకులకు, ఆది నుంచీ పార్టీలో ఉంటూ అవకాశం కోసం ఎదురు చూస్తున్న మునుపటి నేతలకు మధ్య తలెత్తుతున్న సరికొత్త విభేదాలతో అతలాకుతలమవుతోంది. ఒకపక్క అయ్యన్న, గంటా వివాదం సృష్టిం చిన కలకలం ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటే, మరోపక్క కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల పెత్తనం పాత నేతల్లో ఆగ్రహావేశాలు సృష్టిస్తోంది. ఇప్పటికే పార్టీలో ఉన్న పాత నేతలు పరిస్థితి చక్కదిద్దాలని కోరడానికి ప్రజాగర్జనకు ముందే బాబు వద్ద పంచాయతీ పెట్టనున్నారంటే పరిస్థితి అర్ధమవుతుంది.
     
    గొడవకు ‘గంటా’రావం!
     
    నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చంద్రబాబు సమక్షంలో హైదరాబాద్‌లో పార్టీలో చేరనున్న నేపథ్యంలో  రగడ ముదురుపాకాన పడింది. ఈ పరిణామం నియోజక వర్గాల్లో క్యాడర్‌లో, నేతల్లో చిచ్చుపెడుతోంది. పెందుర్తి, భీమిలి, గాజువాక, ఎలమంచిలి నియోజకవర్గాల్లో పార్టీని ఏళ్లతరబడి నమ్ముకుంటే ఇప్పుడు వీరొచ్చి ఆ సీట్లు తమవేనని ప్రకటిస్తూ ఉండడం పార్టీలో చిచ్చు రేపుతోంది.
     
    గంటా బృందం ఏకపక్షంగా చేస్తున్న ప్రకటనలతో ప్రస్తుత పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు కారాలు మిరియాలు నూరుతున్నారు. భీమిలి ఎమ్మెల్యే అవంతి టీడీపీలో చేరినప్పటినుంచి విశాఖ ఉత్తరం సీటు తనదేనని చాటుకుంటున్నారు. దీంతో  ప్రస్తుతం అక్కడ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి భరణికాన రామారావు మండిపడుతున్నారు. తమను సంప్రదించకుండానే చేస్తున్న ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.
     
    గంటా వైఖరిపై ఇన్‌చార్జిలు, కొందరు మాజీ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటినుంచే తమపై పెత్తనాన్ని వీరంతా సహించలేకపోతున్నారు. భరణికాన బుధవారం క్యాడర్‌తో సమావేశమై అవంతి వైఖరిపై చర్చిం చారు. గంటా బృందాన్ని అలాగే కొనసాగనిస్తే భవిష్యత్తులో తమకు ప్రాధాన్యం ఉండదని, క్యాడర్‌కూ నష్టమని తీర్మానించారు.
     
    భీమిలిలో సీనియర్ నేత, మాజీ మంత్రి అప్పలనరసింహరాజు కూడా అవంతి వైఖరిపై గుర్రుగా ఉన్నారు. పెందుర్తిలోనూ అదే పరిస్థితి. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న పంచకర్ల చేరికతో అక్కడున్న సీనియర్ నేత బండారు సైతం లోలోపల గుబులు చెందుతున్నారు. బాబు వద్ద గంటా చక్రం తిప్పి పంచకర్లకు సీటు ఇప్పించుకుంటారేమోనని క్యాడర్ అనుమానాలు వ్యక్తం చేస్తుండడంతో బండారు కలత చెందుతున్నారు.
     
    పాయకరావుపేటలోనూ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ఎమ్మెల్యే కన్నబాబురాజు పదేళ్లపాటు పార్టీ కార్యకర్తలను, నేతలను ఇ బ్బందులకు గురి చేశారని వీరు ఆరోపిస్తున్నా రు. అటువంటి వ్యక్తిని పార్టీలో ఎలా చే ర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. గంటా బృందాని కి వ్యతిరేకంగా నేతలంతా ఈ నెల 12న ప్ర జాగర్జన సభకు హాజరుకానున్న బాబు ముం దు పంచాయతీ పెట్టాలని నిర్ణయించారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement