అనంతపురం : అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. చిన్నపిల్లల వార్డులో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగటంతో కలకలం రేగింది. దాంతో రోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆ సమయంలో చిన్నపిల్లల వార్డులో సుమారు 21మంది పసికందులు చికిత్స పొందుతున్నారు. కాగా ఆస్పత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తమై చికిత్స పొందుతున్న చిన్నారులను మరో వార్డుకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.