విశాఖ:నగరంలోని తుమ్మిడి బ్రదర్స్ షోరూంలో ఆదివారంరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షోరూంలో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. షాపులోని వస్త్రాలు చాలా వరకూ అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. విద్యుత్ షార్ట్ సర్యూట్ వల్లే ప్రమాదం సంభవించినట్లు సమాచారం.