కృష్ణా: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కందలంపాడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున చేపల వాన కురిసింది. శనివారం కురిసిన చేపల వానతో గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పొలాల్లో చేపలు కనిపించాయి. దీంతో గ్రామస్తులు చేపలను పట్టుకునేందుకు ఉత్సాహం చూపారు. వర్షం ద్వారా వచ్చిన ఈ చేపలు 3-5 కేజీలు ఉండటంతో ప్రజలు ఆనందంతో పట్టుకున్నారు.