fish rain
-
శ్రీకాకుళం జిల్లాలో చేపల వర్షం
పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం శిబ్బిలి గ్రామ శివారులోని పొలాల్లో శుక్రవారం చేపల వర్షం కురిసింది. ఈ ప్రాంతంలో రాత్రి నుంచి వర్షం పడుతోంది. ఉదయం పొలాల్లో చేపలు కుప్పతెప్పలుగా కనిపించాయి. దాంతో గ్రామస్తులు చేపలను చూసి ఆశ్చర్యపోయారు. కొందరు వాటిని ఇంటికి తెచ్చుకున్నారు. తుఫాను మూలంగా కురుస్తున్న భారీ వర్షంతో పాటు చేపలు పడిఉంటాయని భావిస్తున్నారు. -
చేపల జడివాన
దామరచర్ల (నల్లగొండ) : నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రం శివారులోని వీరభద్రాపురంలో చేపల వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి దామరచర్లలో కుండపోత వాన పడింది. దీంతో ఆకాశం నుంచి పావుకిలో నుంచి కేజీ బరువు గల చేపలు పొలాల్లో పడ్డాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వలలు, కర్రలతో చేపలను వేటాడారు. కొర్రమేను, వాలుగ రకం చేపలు దొరికినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ తరహా ఘటన ఇదే మొదటిదని గ్రామస్తులు చెబుతున్నారు. -
చేపల వాన.. నిజమేనా?
-
చేపల వాన.. నిజమేనా?
గుంటూరు: చేపల వాన కురిసినట్టు ప్రచారం జరగడంతో గుంటూరు జిల్లా నగరం మండలం ఉయ్యూరువారి పాలెం వాసులు పొలాలకు పరుగులు పెట్టారు. తమకు దొరికిన చేపలు తెచ్చుకున్నారు. ఈ ఉదయం పొలాలకు వెళ్లిన వారు చేపలు చూసి ఆశ్చర్యానికి లోనయారు. తెల్లవారుజామున కురిసిన వర్షానికి చేపలు పడ్డట్టు స్థానికులు చెబుతున్నారు. కేవలం రెండు ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే చేపలు కనబడడం అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడికి 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా చేపల చెరువులు లేవు. ఇక పొలాలకు నీరు అందించే కాల్వలు అడుగంటి ఉన్నాయి. దీంతో చేపలవాన కురిసిందని స్థానికులు గట్టిగా చెబుతున్నారు. ఇంతకు ముందు కృష్ణా జిల్లాలోనూ చేపల వర్షం కురిసినట్టు వార్తలు వచ్చాయి. అయితే మన దేశంలో చేపలు వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. -
కృష్ణా జిల్లాలో చేపల వాన
-
కృష్ణా జిల్లాలో చేపల వాన
కృష్ణా: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కందలంపాడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున చేపల వాన కురిసింది. శనివారం కురిసిన చేపల వానతో గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పొలాల్లో చేపలు కనిపించాయి. దీంతో గ్రామస్తులు చేపలను పట్టుకునేందుకు ఉత్సాహం చూపారు. వర్షం ద్వారా వచ్చిన ఈ చేపలు 3-5 కేజీలు ఉండటంతో ప్రజలు ఆనందంతో పట్టుకున్నారు. -
చేపలే చినుకులై...