శ్రీకాకుళం జిల్లాలో చేపల వర్షం
పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం శిబ్బిలి గ్రామ శివారులోని పొలాల్లో శుక్రవారం చేపల వర్షం కురిసింది. ఈ ప్రాంతంలో రాత్రి నుంచి వర్షం పడుతోంది. ఉదయం పొలాల్లో చేపలు కుప్పతెప్పలుగా కనిపించాయి. దాంతో గ్రామస్తులు చేపలను చూసి ఆశ్చర్యపోయారు. కొందరు వాటిని ఇంటికి తెచ్చుకున్నారు. తుఫాను మూలంగా కురుస్తున్న భారీ వర్షంతో పాటు చేపలు పడిఉంటాయని భావిస్తున్నారు.