ప్రదీప్ హత్యకేసులో ఐదుగురి అరెస్ట్ | five arrested in btech student Pradeep Murder case | Sakshi
Sakshi News home page

ప్రదీప్ హత్యకేసులో ఐదుగురి అరెస్ట్

Published Thu, Nov 10 2016 5:47 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

ప్రదీప్ హత్యకేసులో ఐదుగురి అరెస్ట్

ప్రదీప్ హత్యకేసులో ఐదుగురి అరెస్ట్

విశాఖపట్నం:  ఇంజనీరింగ్ విద్యార్థి దానబాల ప్రదీప్ హత్య కేసులో 8 మందిపై కేసు నమోదైంది. ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం డిఫెన్స్ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. గత నెల 28న మాకవరంపాలెంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న ప్రదీప్ హత్యకు గురైన విషయం తెలిసిందే.

గత నెల 28న సహచర విద్యార్థినితో కలిసి కశింకోట వద్ద ప్రదీప్ బస్సు దిగాడు. ఆ తర్వాత ఆ అమ్మాయితో కలిసి చాట్ తింటుండగా గుర్తుతెలియని దుండగులు ప్రదీప్ను అక్కడినుంచి లాక్కెళ్లి కిడ్నాప్ చేసి.. ఆపై హత్య చేశారు. అదే రోజు ప్రదీప్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద ప్రదీప్ బంధువులు ఆందోళన చేస్తున్నారు. ప్రదీప్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement