‘ఆహార భద్రత’కూ ఆధార్
Published Sun, Dec 22 2013 4:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
ఏలూరు, న్యూస్‌లైన్ : నిరుపేదలందరికీ ఆహార భద్రత కల్పిస్తామని 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికార పగ్గాలు చేపట్టిన నాలుగేళ్ల అనంతరం.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన ఆ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో ఆహార భద్రత పథకం కింద తెల్లరేషన్ కార్డుదారులందరికీ ఆహార ధాన్యాలను సబ్సిడీపై పంపిణీ చేయూలనే తలంపుతో ప్రభుత్వం ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో రేషన్‌కార్డులను ఆధార్ నంబర్లతో అనుసంధానించే ప్రక్రియను జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఈ నెలాఖరు నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయూలని కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశాలిచ్చారు. ఈ ప్రక్రియ పూర్తి చేస్తేనే జిల్లాలో ఆహార భద్రత పథకాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో ఆధార్ సీడింగ్‌ను
పూర్తి చేయడానికి అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.
ఇదీ ప్రయోజనం : ఆహార భద్రత పథకం అమలులోకి వస్తే తెల్ల రేష న్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ ఐదు కేజీల బియ్యూన్ని పంపిణీ చేస్తారు. ప్రస్తుతం ఒక కుటుం బంలో ఎంతమంది సభ్యులున్నా గరిష్టంగా 20 కేజీలకు మించి బియ్యం ఇవ్వటం లేదు. ఇద్దరు మాత్రమే సభ్యులుంటే తలకు నాలుగు కేజీల చొప్పున ఎనిమిది కేజీల బియ్యూన్ని మాత్రమే ఇస్తున్నారు. కొత్త పథకం అమలులోకి వస్తే ఒక కుటుంబంలో 10మంది ఉన్నా తలకు ఐదు కేజీల చొప్పున 50 కేజీల బియ్యం పంపిణీ చేస్తారు.
6వేల మెట్రిక్ టన్నులు అదనం
ఆహార భద్రత పథకం అమలులోకి వస్తే జిల్లాలోని పేదలకు ప్రతినెలా 6వేల మెట్రిక్ టన్నుల బియ్యూన్ని అదనంగా పంపిణీ చేసే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం తెల్లరేషన్ కార్డుదారులకు 16వేల మెట్రిక్ ట న్నుల బియ్యం పంపిణీ చేస్తుం డగా, కొత్త పథకంలో 22 మెట్రిక్ టన్నులను అందజేయూల్సి ఉం టుందని అంచనా. తెల్లరేషన్ కార్డుల్లో నమోదైన పేర్ల ఆధారంగా చూస్తే పేదలు 33లక్షల మంది ఉన్నారు. వారిలో ఇప్పటివరకు 23 లక్షల మందికి ఆధార్ కార్డుల అనుసంధానం పూర్తరుు్యంది. ఇంకా 10 లక్షల మంది ఆధార్ చేయించుకోవాల్సి ఉంది. ఈ పనిని మరో 10 రోజుల్లో పూర్తి చేయూలనే లక్ష్యంతో యంత్రాంగం ఉంది. వారిలో 2.50 లక్షల మంది నేటికీ ఆధార్ కార్డులు పొందలేదు. వారికి యుద్ధప్రాతిపదికన వాటిని అందించాలనే ఉద్దేశంతో పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Advertisement