జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రైతుల కు తీవ్రనష్టం వాటిల్లింది. లక్షలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి.
పాలమూరు, న్యూస్‌లైన్: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రైతుల కు తీవ్రనష్టం వాటిల్లింది. లక్షలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. ఫలి తంగా అన్నదాత అరణ్యరోదనే మిగిలిం ది. జిల్లాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్ర త్యేకబృందాల ద్వారా చేపట్టిన పంటనష్టం పరిశీలన కూడా పూర్తయింది.
48 మండలాల్లోని సుమారు 787 గ్రామాల్లో 1.71 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు నష్టపోయినట్లు అధికారికంగా గుర్తించా రు. ఈ మేరకు రైతాంగానికి రూ.860 కోట్లమేర నష్టం కలిగిందని తేల్చారు. ఖరీఫ్‌లో పాలమూరు జిల్లావ్యాప్తంగా 1.86 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పం టలు సాగుచేయగా, సెప్టెంబర్, అక్టోబరు మాసాల్లో కురిసిన అధికవర్షాల కారణంగా 1.71 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు గుర్తించారు. అధికారుల పరిశీలన మేరకు వరి 11.324 ఎకరాలు, మొక్కజొన్న 2578 ఎకరాలు, జొన్న468 ఎకరాల్లో పంటలు దెబ్బతిని సుమారు రూ.150 కోట్ల మేర రైతులకు నష్టం కలిగింది.
పత్తిరైతు కుదేల్
ఖరీఫ్‌లో పత్తి సాధారణంగా 3.11 లక్షల ఎకరాల్లో సాగుచేపట్టాల్సి ఉండగా, అం తకుమించి 4.60 లక్షల ఎకరాల్లో సాగయింది. ఇందులో లక్ష ఎకరాల భూమిని రైతులు కౌలుకు తీసుకుని పత్తిపంటను సాగుచేపట్టారు. కాగా, అక్టోబరులో కురి సిన అధికవర్షాల కారణంగా 1.55 లక్షల ఎకరాల మేర పత్తిపంట దెబ్బతిన్నట్లు అధికారుల పరిశీలనలో గుర్తించారు.
దీంతో పంటదిగుబడి, సాగుకయ్యే ఖ ర్చుల ఆధారంగా రూ.698కోట్ల మేర పంటనష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇది కేవలం అధికారిక అంచనా మాత్ర మే.. ఇంతకంటే ఎక్కువ మొత్తంలో పం టనష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. జిల్లాలోని మద్దూరు, చిన్నచింతకుంట, దేవరకద్ర, ధన్వాడ, నర్వ, ఆత్మకూర్, మాగనూరు, ఇటిక్యాల, వడ్డేపల్లి, అలంపూర్, మానవపాడు, మల్దకల్, గట్టు, ధరూర్, అయిజ, గద్వాల మండలాల్లో ఏమాత్రం పంటనష్టం కలుగలేద ని నిర్ధారించారు. కాగా రబీ సాగుకోసం జిల్లా వ్యాప్తంగా 19,570 ఎకరాల్లో వేరుశనగను విత్తుకున్నారు. వర్షాలు అధికంగా కురియడంతో దాదాపు 8246 మంది రైతులు విత్తనాలు చల్లేందుకు చేసిన ఖర్చు మొత్తాన్ని లెక్కిస్తే రూ.22 కోట్ల మేర నష్టాన్ని చవిచూశారు.
పెరిగిన పెట్టుబడులు
ఎర్ర, ఇసుకనేలల్లో డీఏపీ, యూరియా, పొటాష్‌లు మూడు దఫాలుగా వేస్తారు. వర్షాల వల్ల దాదాపు ఆరు నుంచి ఎనిమి ది పర్యాయాలు వేయాల్సి వచ్చింది. పురుగు మందు చల్లడం కూడా అదేస్థాయిలో పెరిగింది. సాధారణంగా పత్తిసా గు ఎకరాకు రూ.18వేలు ఖర్చవుతుంది. ఈఏడాది రూ.24వేల వరకు పెరిగింది. దీనికితోడు దిగుబడి చేతికొచ్చే సమయంలో అధికవర్షం కారణంగా పంటలు దెబ్బతినడంతో వాటిని కలుపుకుని ఎకరాకు రూ.45వేల చొప్పున నష్టం అంచనావేస్తే 1.55 లక్షల ఎకరాలకు పత్తిపంటపై రూ.698 కోట్లను పత్తిరైతులు నష్టపోవాల్సి వచ్చింది. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, ఆముదం, మొక్కజొన్న ఇతర పంటలతోపాటు, వేరుశనగ విత్తుకున్న రైతాంగం రూ.172కోట్ల మేర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.