విజయనగరం ఫోర్ట్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోనున్న వేళ అభం, శుభం తెలియని బాలికపై మైనర్ బాలుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవ గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో టీవీ చూసేందుకు వెళ్లిన బాలికపై ఎవరూ లేని సమయంలో బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తనతల్లికి తెలియజేసినట్టు సమాచారం. అయితే ఏకారణం చేతనో బాలిక తల్లిదండ్రులు మంగళవారం వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
బాలిక ఆరోగ్య పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గంట్యాడ పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం విజయనగరం ఘోషాస్పత్రికి మంగళవారం సాయంత్రం తీసుకువచ్చారు. విషయం తెలిసిన వెంటనే నేచర్ కొలాబ్ ఆర్గనైజేషన్ చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యులు నరవ గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించి బాలికకు, బాలుడికి కౌన్సెలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ కోన బంగారుబాబు, కౌన్సిలర్ జి.కె.దుర్గ, గ్రామ అంగన్ వాడీ వర్కర్ పాల్గొన్నారు. ఘోషాస్పత్రికి తీసుకొచ్చిన చిన్నారిని బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ కేసలి అప్పారావు, బాలల సంరక్షణ అధికారి లక్ష్మి పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి ఆరా తీశారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు.
నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి
Published Wed, Mar 8 2017 3:04 AM | Last Updated on Tue, Mar 3 2020 7:07 PM
Advertisement
Advertisement