హైదరాబాద్: పవన విద్యుత్ ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీనిద్వారా వచ్చే ఐదేళ్లలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చే వారికి రాయితీలు కల్పించనున్నారు. దీనికోసం సింగిల్ విండో విధానంలో అనుమతులివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సింగిల్ విండో విధాన పర్యవేక్షణకు ఆరుగురు సభ్యులతో ఒక హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.