స్వగ్రామం చేరిన ‘గాలి’ భౌతికకాయం | Gali muddukrishnama naidu funeral is this morning's | Sakshi
Sakshi News home page

స్వగ్రామం చేరిన ‘గాలి’ భౌతికకాయం

Published Thu, Feb 8 2018 1:15 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

Gali muddukrishnama naidu funeral is this morning's  - Sakshi

గాలి ముద్దుకృష్ణమ భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న సీఎం చంద్రబాబు

సాక్షి, నెట్‌వర్క్‌: తీవ్ర జ్వరంతో హైదరాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి మరణించిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడి భౌతికకాయాన్ని బుధవారం ప్రత్యేక విమానంలో ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురం తరలించారు. మంత్రులతో కలిసి వెంకట్రామాపురం చేరుకున్న సీఎం చంద్రబాబు గాలికి నివాళులర్పించారు.

ఎమ్మెల్యేలు ధూళి పాళ్ల నరేంద్ర, సత్యప్రభ, నారాయణస్వామి, తలారి ఆదిత్య, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, దొరబాబు, కరణం బలరామ్, శాసనమండలి చైర్మన్‌ ఫరూక్, వైఎస్సార్‌సీపీ నేతలు భూమన కరుణాకర్‌ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌కే రోజా, పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి, రాజ్యస భ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. నేడు గాలి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు చెప్పారు. 

వైఎస్‌ జగన్‌ సంతాపం
సీనియర్‌ రాజకీయ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడి మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో నిరాడంబరుడిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి తన సానుభూతిని తెలుపుతున్నానని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement