ఓఎన్జీసీ రిగ్ నుంచి గ్యాస్ లీక్:ఆందోళనలో గ్రామస్తులు | gas leak from ongc gas rig at bontuvarimeraka in east godavari district | Sakshi
Sakshi News home page

ఓఎన్జీసీ రిగ్ నుంచి గ్యాస్ లీక్:ఆందోళనలో గ్రామస్తులు

Published Sat, Nov 29 2014 10:43 PM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

gas leak from ongc gas rig at bontuvarimeraka in east godavari district

తూ.గో:జిల్లాలో మరోసారి ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయిన ఘటన కలకలం సృష్టించింది. శనివారం రాత్రి మామిడికుదురు మండలం బొంతువారిమెరక సమీపంలోని ఓఎన్జీసీ రిగ్ వద్ద గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గ్రామస్తులు భయాందోళనతో పరుగులు తీశారు. గ్యాస్ లీక్ పై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

 

గత జూలై నెలలో మలికిపురం మండలంలో ఓఎన్‌జీసీ వెస్ట్ స్ట్రక్టర్ పరిధిలోని తూర్పుపాలెంలో గల  కేశనపల్లి  బ్లోఅవుట్ లో గ్యాస్ లీక్ అయిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల వ్యవధిలో మరోసారి గ్యాస్ లీక్ కావడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement