=46 కిలోమీటర్ల కొత్త విద్యుత్ లైన్
=రూ.18 లక్షలతో ఎన్పీడీసీఎల్ గెస్ట్‌హౌస్
=జనవరి నెలాఖరు వరకు పనులు పూర్తి
=‘న్యూస్‌లైన్’తో వరంగల్ సర్కిల్ ఎస్‌ఈ మోహన్‌రావు
వరంగల్, న్యూస్‌లైన్ : ‘ఈసారి మేడారం మహా జాతర చుట్టూ ఎటు చూసినా విద్యుత్ వెలుగులు విరజిమ్ముతాయి. 46 కిలోమీటర్ల మేరకు కొత్త విద్యుత్ లైన్లు వేస్తున్నాం. 107 ట్రాన్స్‌ఫార్మర్లు పెడుతున్నాం. కరెంట్ పనులు మొత్తం జనవరి నెలాఖరు వరకు పూర్తి చేసి సిద్ధంగా ఉంటాం’.. అని ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ ఎస్‌ఈ వంగీరపు మోహన్‌రావు వెల్లడించారు. జాతరకు నిధుల విషయంలో కొంత సందిగ్ధత నెలకొన్నా పనులు పూర్తి చేసేందు కు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చేయాల్సిన పనులకు ఈనెల 23న టెండర్లు ఖరారు చేసి వారం రోజుల్లో చేపడతామన్నారు. జాతరలోని సబ్‌స్టేషన్ ఆవరణలో రూ.18 లక్షలతో ఎన్పీడీసీఎల్ గెస్ట్‌హౌస్ నిర్మిస్తున్నాం. దానికి సంబంధించిన టెండరు పూర్తి చేసినట్లు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
రూ.1.12 కోట్లతో ప్రతిపాదనలు
జాతర చుట్టూ 11కేవీ విద్యుత్ లైన్ 6 కిలోమీటర్లు, 6.3కేవీ లైన్ 4 కిలోమీటర్లు, ఎల్‌టీ లైన్ 31 కిలోమీటర్లు, ఏబీ కేబుల్ లైన్ 6కిలోమీటర్లు వేస్తున్నాం. ఇప్పటికే కొన్ని ట్రాన్స్‌ఫార్మర్ల అక్కడ ఉన్నాయి. వాటితో పాటుగా 160 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు 20, 100కేవీ ట్రాన్స్‌పార్మర్లు 50, 33కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు 17, సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లు 20 ఏర్పాటు చేస్తున్నాం. వీటికి అదనంగా అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు 15 శాతం ట్రాన్స్‌ఫార్మర్లను స్టాండ్‌బైలో ఉంచుతున్నాం.
స్తంభాల నుంచి తీగ లాగడం, కొత్త గద్దెలు, స్తంభాలు వేయడం తదితర పనుల కోసం ఈనెల 23న టెండరు ఖరారు చేస్తాం. 63 కొత్త సంభాలు జాతర ప్రాంగణంలో, 300 స్తంభాలు జాతర చుట్టూ ప్రాంతా ల్లో వేస్తున్నాం. వీటన్నింటికీ రూ.1.12 కోట్లతో ప్రతిపాదనలు చేసి టెండర్లకు పిలిచాం. ప్రభుత్వం నుంచి బడ్జెట్ విడుదలకు సంబంధించి ఎలాంటి హామీ రాలేదు. కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి రూ.25లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. నిధుల విషయంలో కొంత ఇబ్బందులున్నా.. పనులను ఆలస్యం కానీ యం. జనవరి 30 నాటికి పూర్తి చేస్తాం.
మెగా పవర్ ట్రాన్స్‌ఫార్మర్
ప్రస్తుతం గద్దెల వద్దకు ఇచ్చే ప్రధాన విద్యుత్ లైన్‌కు 5 ఎంఏ మెగా పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశాం. ఈ ట్రాన్స్‌ఫార్మర్‌తోనే నాలుగైదు గ్రామాలకు సరిపడా విద్యుత్‌ను అందించవ చ్చు. మరో 5ఎంఏ మెగా పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను సబ్‌స్టేషన్‌లో పెడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనైనా విద్యుత్ సరఫరా నిలిచి పోయో సమస్యే ఉండదు. జాతర ప్రాంతంలో దుకాణాలకు ఇచ్చే విద్యుత్ సరఫరాకు కొత్త లైన్ ఏర్పాటు చేస్తున్నాం. దీంతో గద్దెలు, జాతర ప్రాంగణానికి ఒక లైన్, కమర్షియల్ సర్వీసులకు ఒక లైన్ ఉంటుంది. జంపన్నవాగు, పస్రా నుంచి వచ్చే ప్రధాన రహదారి, కొత్త బస్టాండ్, హాస్టల్ ప్రాంతాలకు విద్యుత్ సరఫ రా చేస్తాం. దీంతో భక్తులు ఎక్కడైనా విశ్రాంతి తీసుకునేందుకు వీలుంటుంది. చీకటి సమస్య ఉండదు.
మా ఖర్చులు చూడటం లేదు
అక్కడ కొత్త ప్రాజెక్టు తరహాలోనే ఏర్పాట్లు చేయాల్సి ఉంది. దాని కోసం సంస్థపై భారం పడుతోంది. విద్యుత్ వినియోగం చార్జీలు మినహాయిస్తే.. కాంట్రాక్టర్లకు చెల్లింపులు, లేబర్, రవా ణా చార్జీలు, సర్వీసు, సెస్.. ఇలా రూ.1.75 కోట్లు ఉంటుంది. అయితే జాతరకు మేం వేసిన ఖర్చు రూ.1.12కోట్లు. వాటిని చెల్లిం చేందుకు సైతం దేవాదాయ శాఖ సవాలక్ష ప్రశ్నలు వేస్తోంది. పాత లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తీసి వరంగల్‌కు తీసుకువచ్చి జాత ర సమయంలో మళ్లీ తీసుకుపోవాలి. ఈ ఖర్చులు సంస్థ భరిం చదు. అక్కడ పెడితే రక్షణ ఉండదు. ఈ బిల్లులు, విద్యుత్ విని యోగం బిల్లుల్లో బెట్టు చేస్తే పనులు జరగవు. ట్రాన్స్‌ఫార్మర్లు, తీగలు తీసుకుపోతున్నారంటున్నారు. వాటిని ఉంచితే భద్రత బాధ్యత ఎవరిది. దేవాదాయ శాఖ ఆ బాధ్యతను తీసుకుంటే వాటిని అక్కడే ఉంచుతాం.
ముందుగా రూ.25 లక్షలు ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు. జెడ్పీ సీఈఓ నుంచి తీసుకోవాలని లేఖ ఇచ్చి నా ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. వాటిని ఇస్తే పనులు ప్రారంభమయ్యే వీలుంది. అయినా ఈనెల 23 వరకు టెండర్లు ఖరారు చేసి పనులు వేగవంతం చేస్తాం. మేడారంలో నిర్మించిన సబ్‌స్టేషన్ సమీపంలోనే ఎన్పీడీసీఎల్ వసతి గృహం ఏర్పాటు చేసేందుకు రూ.18 లక్షల నిధులు కేటాయించారు. టెండర్లు పూర్తయ్యాయి. ఈసారి సిబ్బంది డిప్యూటేషన్ కూడా ఎక్కువగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. విద్యుత్ సరఫరాలో ఎలాం టి ఇబ్బందులు రానీయకుండా చర్యలు చేపడుతున్నాం.
జాతర చుట్టూ వెలుగులు
Published Sat, Dec 21 2013 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement
Advertisement