
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి హారతి పడుతున్న మహిళలు
సాక్షి, నెల్లూరు(సెంట్రల్): నిరంతరం ప్రజల కోసం పోరాటాలు చేస్తున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్‌కు రానున్న ఎన్నికలలో ఒక్క అవకాశం ఇవ్వాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోరారు. స్థానిక 29వ డివిజన్ రిత్విక్ ఎన్‌క్లేవ్ ప్రాంతంలో శ్రీధర్‌రెడ్డి సమక్షంలో మంగళవారం 150 మంది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సాధారణంగా అధికార పార్టీలోకి వలసలు వెళుతుంటారని, అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా పరిస్థితి ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అనేకమంది చేరుతున్నారని, దీనిని బట్టి చూస్తే ఈసారి వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో నాయకులు బొబ్బల శ్రీనివాసయాదవ్, మాదా బాబు, రాజా, మస్తాన్‌రెడ్డి, వంశీ, కుమార్, శ్యామ్‌సింగ్, సతీష్, రంగారెడ్డి, మురహరి, గౌతమ్, మేరీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment